మధిర లో ఘనంగా దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా వారు సెమీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంజారా కాలనీ లోని శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దేవాలయ కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా, పాటిబండ్ల సత్యంబాబు, శ్రీలం వెంకటరెడ్డి, కర్లపూడి వాసు, మల్లాది వాసు, కర్నాటి రామారావు, గుర్రం రామారావు, వనమా వేణుగోపాల్ రావు, తదితర ముఖ్య నాయకులతోపాటు భక్తులు పాల్గొన్నారు.