కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలు దాసరిపల్లి జయచంద్రారెడ్డి మరియు కట్టా సురేంద్ర నాయుడులపై పార్టీ అధినాయకత్వం కఠిన చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తక్షణమే వారిద్దరినీ టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు.
ఇరువురిపైనా సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఈ స్కాముకు తెరతీసిన జయచంద్రారెడ్డి, జనార్థన్ రావులు, వైకాపా నాయకులతో కుమ్మకై దందా నడిపి… విచారణ మొదలవడానికి నెల రోజుల ముందే దక్షిణాఫ్రికాకు పారిపోయినట్లు తెలుస్తోంది. పార్టీ తీసుకున్న చర్యలపై జనం జేజేలు పలుకుతున్నారు. దీపావళి సంబరాలు ముందే చేసుకుంటున్నారు.
పార్టీలో అవినీతికి తావు లేదంటూ తీసుకున్న ఈ నిఖార్సయిన చర్యకు ప్రజల నుంచి ఊహించని స్పందన వచ్చింది. టీడీపీ నేతలపై వేటు పడగానే, తంబళ్లపల్లె టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. దీపావళి ముందే వచ్చినట్లు భావించి, వారు టపాసులు కాలుస్తూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతం కోసం, దాని మంచి కోసం నాయకులు నిజాయితీగా చర్యలు చేపడితే, శ్రేణులు ఇలాగే సంబరాలు చేసుకుంటాయి.
మరోవైపు, వైకాపా నాయకులు లిక్కర్ స్కాం కేసుల్లో చిక్కుకుంటే, అరెస్టు అయినా.. వారి కార్యకర్తలు ‘రఫ్ఫా రఫ్ఫా’ అంటూ ప్లకార్డులు పట్టుకుని తిరిగిన రోజులు ప్రజలు మర్చిపోలేదు. నేరస్తులు పోలీసు అధికారులను బెదిరిస్తూ, జడ్జీల దగ్గర ఏడుపులు మొదలెట్టేవారు.
ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. తప్పులు జరిగితే నిర్భయంగా చర్యలు తీసుకొని, పార్టీని ప్రక్షాళన చేసే నాయకులు ఎవరో… ఏకంగా స్కాం చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి దోచుకునే నాయకులు ఎవరో వారికి స్పష్టంగా తెలుసు. ఇదే నిఖార్సయిన చంద్రబాబు నాయకత్వానికి, అవినీతికి జగనుకు మధ్య ఉన్న తేడా అని ప్రజలు అనుకుంటున్నారు.