కడప జిల్లాలో వైఎస్ కుటుంబం 50 ఏళ్ల అరాచకాలు, హింసకి తెరపడిందని టీడీపీ సీనియర్ నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. 50 ఏళ్లుగా ప్రజాస్వామ్యానికి పాతరేసి ఎవరినీ ఓటేయనీయకుండా రిగ్గింగ్ చేసి గెలిచారు. తమది గొప్ప కుటుంబం అని చెప్పుకునే వైఎస్ కుటుంబం పులివెందులలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించారు అని ఆయన అన్నారు. 50 ఏళ్లుగా ప్రజలను ఓటేయనీయకుండా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. హత్యలు, దాడులు, మానభంగాలు, ఆస్తుల ధ్వంసంతో ప్రజాస్వామ్యానికి పాతరేశారు. జగన్ ఏడుపులు, పెడబొబ్బలు పెట్టి చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. ప్రకృతి చాలా గొప్పది.. 2024 ఎన్నికల్లో వైసీపీని 151 నుంచి 11 కి పడేసింది. చంద్రబాబుకు కాదు జగన్ రెడ్డికే 2024 చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం. ఒళ్లుదగ్గర పెట్టుకుని నాలుక అదుపులో ఉంచుకుని మాట్లాడాలని జగన్ ను హెచ్చరిస్తున్నాం అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతితికించిన పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలకు ధన్యవాదాలు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని బతికించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని యరపతినేని అన్నారు.
previous post
next post