మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా కులాలకు, మతాలకు, వర్గాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమలు చేపడితే నాన్-బేలబుల్ (Non-Bailable) కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ డి.శ్రీనివాస రావు హెచ్చరించారు. మెదక్ జిల్లా పరిధిలో సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
సోషల్ మీడియా వేదికగా రాజకీయంగాను, కుల, మత, ప్రాంతీయంగాను ప్రజల భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్న వాటిని సామాజిక మాద్యమాలలో షేర్ చేసిన చట్టప్రకారం తీవ్రమైన చర్యలు ఉంటాయని తెలిపారు. సామాజిక మాధ్యమాలు అయిన Facebook, Twitter, ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూపులలో ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా, ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్న, తమకు తెలియని వీడియోలు, ఫోటోలు పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన ఆ గ్రూపు అడ్మిన్ నీ బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడుతాయి అని తెలిపారు.