ఎన్నో ఏళ్ల తర్వాత రాయలసీమ ప్రజల నీటి కలలు తీరే రోజు వచ్చింది. పంటలు పచ్చగా నీళ్లతో తడిసే విధంగా హంద్రి నీవా కాలువ జలకళ వచ్చింది. హంద్రీ నీవా కాలువ నీళ్లు ఈరోజు మదనపల్లికి చేరుకున్న సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు యం షాజహాన్ బాషా ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని హంద్రీనీవా కాలువలో ప్రవహిస్తున్న నీరుకు రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కుంకుమ పసుపు పూలతో నీళ్లకు స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. మదనపల్లి శాసనసభ్యులు యం షాజహాన్ బాషా జలహారతి కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
previous post