హైదరాబాద్ హోమ్

వంద కోట్ల విలువైన స్ధలం కబ్జా చెర నుంచి విముక్తి

#JubileeHills

జూబ్లీహిల్స్ హౌజ్ బిల్డింగ్‌ సొసైటీ  ప్రెసిడెంట్  బొల్లినేని రవీంద్రనాధ్  న్యాయపోరాటంతో  100 కోట్ల విలువైన  2 వేల గజాల సొసైటీ ల్యాండ్ కబ్జా చెరనుంచి  విముక్తి లభించింది. జూబ్లీహిల్స్ లో  20 ఏళ్లుగా  అక్రమార్కులు  రెండు వేల గజాల స్థలాన్ని కబ్జా చేసి కట్టడాలు నిర్మించారు. 

తాము ఈ స్థలాన్ని ఎవరకి కేటాయించలేదని  జూబ్లీహిల్స్  హౌజింగ్  సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాద్ ఆద్వర్యంలో పాలకమండలి సభ్యులు సుధీర్ఘ న్యాయపోరాటం చేశారు. కోట్ల రూపాయల విలువచేసే సొసైటీ ల్యాండ్ ను ఇతరులకు దారాదత్తం చేసి బినామీలను తెరపైకి పెట్టి   స్థలాన్ని కాజేసే ప్రయత్నం చేశారు. 

లీజ్ పేరుతో రెండు దశాబ్దాలుగా సొసైటీకి రావాల్సిన కోట్ల రూపాయల డబ్బులను కొంతమంది అదృశ్య శక్తులు దిగమింగారు.   కబ్జా చెరనుంచి ల్యాండ్ ను విడిపించకుండా  స్టే పేరుతో అరాచకశక్తులకు  ఆక్రమణదారులకు వంతపాడారు. జూబ్లీహిల్స్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిండెంట్  గా ఎన్నికయిన రోజునుంచి   ఆక్రమణలకు గురయిన భూములను కబ్జాదారుల చెరనుంచి విడిపించేందుకు  రవీంద్రనాద్ తోపాటు సొసైటీ పాలకమండలి సభ్యులు ప్రత్యేక దృష్టి సారించారు.

కోట్ల విలువైన భూములను సొసైటీ కి దక్కేలా న్యాయపోరాటం చేశారు. జూబ్లీహిల్స్ లో విలువైన 2వేల గజాల స్థలాన్ని ఎవరికి కేటాయించలేదని  ఆక్రమణలకు గురైన స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించాలని హైడ్రాకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు సొసైటీ మెంబర్స్. ఆధారాలను పరీశీలించిన హైడ్రా   సొమవారం ఉదయమే అక్రమ కట్టడాలను కూల్చివేసి  ల్యాండ్ ను సొసైటికి అప్పగించింది.

వంద కోట్ల విలువైన ఈ ల్యాండ్  తోపాటు మరో ఆరువేల గజాల స్థలాన్నీ ఇప్పటివరకు కబ్జా దారులనుంచి విడిపించిన  ప్రస్తుత సొసైటీ. ఈ స్ధలాల్లో పలు అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించనున్నట్టు సొసైటీ ప్రెసిడెంట్ బొల్లినేని రవీంద్రనాధ్ తెలిపారు.

వంద కోట్ల ల్యాండ్ ను కబ్జా దారుల నుంచి విడిపించినందుకు  తెలంగాణ ప్రభుత్వానికి , హైడ్రా కమీషనర్ రంగనాధ్ తోపాటు జీహెచ్ఎంసీ అధికారులకు  సొసైటీ ప్రెసిడెంట్ తో పాటు పాలకమండలి సభ్యులు  కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలి

Satyam News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు

Satyam News

NEET, IIT-JEE 2026 సాధనకు డిజిటల్ మెటీరియల్ సిద్ధం!

Satyam News

Leave a Comment

error: Content is protected !!