ప్రపంచం హోమ్

ఇండియాపై ‘టారిఫ్ వార్’ కు ట్రంప్ ఆదేశాలు

#DonaldTrump

భారత్ పై సుంకాల యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ప్రకారం భారతీయ ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించే దిశగా ముసాయిదా నోటీసును అమెరికా ప్రభుత్వం జారీ చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత వస్తువులపై సుంకాలను 50 శాతం పెంచనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. ఆగస్టు 6, 2025న జారీ చేసిన “రష్యా సమాఖ్య ప్రభుత్వంతో ఏర్పడిన ముప్పులను ఎదుర్కోవడం” అనే శీర్షిక గల 14329వ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఈ కొత్త సుంకాలను అమలు చేయనున్నట్లు నోటీసులో పేర్కొంది.

ఆగస్టు 27, 2025నుంచి ఈ అధిక సుంకాలు అమల్లోకి వస్తాయని CBP స్పష్టం చేసింది. ఆ రోజు తెల్లవారుజామున 12:01 గంటల నుంచి అమెరికాలో వినియోగం కోసం దిగుమతి చేసే లేదా గోదాముల నుంచి వినియోగానికి విడుదల చేసే భారత ఉత్పత్తులన్నిటిపైనా ఈ సుంకాలు వర్తిస్తాయి.

రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై ట్రంప్ ఆక్షేపణ

ఇంతకుముందు, జూలై 30న ట్రంప్ భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలను ప్రకటిస్తూ, “భారత్ మిత్రదేశమే అయినా, వారి సుంకాలు ప్రపంచంలోనే అత్యధికం. వాణిజ్యానికి అత్యంత కఠినమైన అడ్డంకులను విధిస్తున్నారు. అదనంగా, వారు తమ సైనిక పరికరాలలో ఎక్కువభాగాన్ని రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు.

శక్తివంతమైన రష్యా ఇంధన కొనుగోలుదారుగా కూడా ఉన్నారు. ఈ సమయంలో ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపాలని ప్రపంచం కోరుతుంటే, భారత్ రష్యాను బలపరుస్తోంది. అందువల్ల భారత్ 25 శాతం సుంకం చెల్లించాలి, అదనంగా జరిమానా కూడా చెల్లించాలి” అని ట్రంప్ తన ట్రూత్ సోషియల్ పోస్టులో పేర్కొన్నారు.

తలవంచని భారత ప్రధాని నరేంద్ర మోడీ

అమెరికా ఒత్తిడిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి వైఖరి ప్రదర్శించారు. ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై 50 శాతం సుంకం అమలులోకి రానున్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లో ఆయన మాట్లాడుతూ “ఎంత ఒత్తిడి వచ్చినా ఎదుర్కొనే శక్తిని మేము పెంచుకుంటాం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గుజరాత్ నుంచి విశేష ఉత్సాహాన్ని పొందుతోంది. ఇది రెండు దశాబ్దాల కృషి ఫలితం” అన్నారు.

ఇకపోతే, పారిశ్రామికదారుల సంఘం ఫిక్కి అమెరికా నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేసింది. 25 శాతం సుంకం భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. భారత వాణిజ్య సంఘాలు కూడా ట్రంప్ నిర్ణయాన్ని వెనుకడుగు వేయించే చర్యగా అభివర్ణించాయి. అయితే, కొంతమంది పరిశ్రమ నేతలు స్వల్పకాలిక అంతరాయాల గురించి హెచ్చరిస్తూ, మరోవైపు ఔషధాలు, వైద్య పరికరాలు వంటి రంగాల్లో బలమైన తయారీ శక్తి ఉన్న భారత్ దీన్ని అధిగమించి కొత్త వాణిజ్య భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.

Related posts

డొల్ల కంపెనీల పుట్ట.. చెవిరెడ్డి బుట్ట

Satyam News

గణనాథుని సేవించే మహా పర్వదినం

Satyam News

మెగా వారసుడికి పేరు పెట్టారు….

Satyam News

Leave a Comment

error: Content is protected !!