రాత్రంతా నిద్ర రాలేదు. ఒంటరి జైలు జీవితం కొత్త, చీకటి భయపెట్టింది. తానేమిటి అని తలచుకుంది. ఎప్పుడూ బంట్రోతులు, బంగాళా, పనిమనుషులు, సిద్ధంగా ప్రభుత్వ కారు. ఎదురుపడి నమస్కరించే వారు, పోలీసులు.
21 ఏళ్లకే సివిల్స్ టాపర్. అదే ఏడాది ఐపీఎస్ తో.. పెళ్లి. 45 ఏళ్లకే తనకు ఈ జీవితమా అనే కన్నీళ్లు సుడులు తిరిగాయి జైలులో.
నాంపల్లి కోర్టుకు తీసుకు వెళ్లారు. ఇంకా గుండెల్లో అదే బాధ. జగన్ కూడా అక్కడ జైలు నుండి కోర్టుకు హాజరయ్యి కనిపించారు. నువ్వే నా ఈ పరిస్థితికి కారణం అని ఆక్రోశించింది. అంతా షాక్ అయ్యారు. మీడియాలో ఆమె వేదనను అచ్చేశారు.
నన్ను భయపెట్టారు ఓబుళాపురం గనుల కోసం అని సీబీఐకి అప్పటికే చెప్పేసి గుండెబరువు దింపేసుకొంది. నడవలేని స్థితిలో కనిపించి బెయిలు మీద వచ్చింది. కొలువులో చేరి, విభజన తరువాత తెలంగాణను ఎంచుకుంది.
మాజీ జైల్మేట్ జగన్ను జనం ఎన్నుకోగానే తాడేపల్లికి అభినందించడానికి వచ్చింది. కేంద్రానికి జగన్ ద్వారా సిఫార్సు చేసి తెలంగాణ నుండి ఆంధ్రాకు వచ్చింది. స్పెషల్ సెక్రెటరీగా ప్రమోషన్ కూడా ఇచ్చాడు జగన్.
అమరావతి మీద ఆమెను ప్రయోగించాడు. ఆ భూములను తాకట్టు పెట్టి, డబ్బులు తెమ్మని. బ్యాంకులు దండం పెట్టాయి. మంగళగిరిలో కొంత భాగాన్ని కలపడం, మధ్యలో అడ్డదిడ్డంగా బయటవారికి అప్పనంగా అక్కడ ఇళ్ల పట్టాలు ఇండ్లు కట్టిస్తాం అంటూ అమరావతి అన్నదాతలను ఏడిపించే పనులు పురమాయించారు.
ఆక్రోశంతో అన్నదాతలు పోరాడుతుంటే ఆ మహిళలు కట్టుకున్న చీరల ధరల గురించి హేళనగా మాట్లాడింది వైకాపా (చంద్రబాబు మెప్పుకోసం ఇంట్లో చెల్లి కట్టిన చీర రంగును కూడా వదలని జగన్ దిగజారుడు నీచత్వం గురించి మనకు తెలిసిందే).
పెట్టుబడుల కోసం విశాఖపట్నంలో సదస్సు పెట్టింది. ఐప్యాక్ వారు కూడా కిట్లు పట్టుకుపోయారు గానీ జగన్ జట్టుకు జడిసి, ఎవరూ మొహం చూపించలేదు.
మళ్లీ రెండో ఇన్నింగ్స్ లోనే కోర్టు ధిక్కారణ క్రింద జైలు శిక్ష పడింది. ప్రాధేయపడి సామాజిక సంక్షేమ హాస్టల్లో చాక్లెట్లు పంచే సామాజిక సేవా శిక్షను ఆనందంగా అనుభవించింది.
జగనుకు జనం 11 ఇచ్చారని తెలిసిన రోజు మిగిలిన తన సర్వీసు కాలాన్ని తలచుకొని రాత్రంతా ఆలోచించి, బాధపడి, ఒక నిర్ణయానికి వచ్చింది. పొద్దున బొకేతో చంద్రబాబు వద్దకు వెళ్లింది. ఆయన బొకే తీసుకోకపోవడంతో భంగపడింది. ఆఫీసులో సంతకాల కోసం మంత్రి నారాయణ వద్దకు ఫైళ్లు పంపింది. ఇప్పుడు అవేమీ వద్దులే అమ్మా కొంతకాలం అని చెప్పడంతో మరోసారి పరువుపోయినంతగా బాధపడింది.
వచ్చే ఏడాది రిటైర్మెంట్ లోపల పోస్టింగ్ కోసం చూస్తుంటే.. తెలంగాణా హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. మళ్లీ శ్రీలక్ష్మి తప్పు చేసింది అని తెలంగాణా కోర్టులో కేసు మొదలైంది.
ఈ బాధల్లో.. తను కట్టుకొనే “చీరల” ఖరీదు గురించి, 11 విగ్గుల గురించి, అవినీతిపరురాలు, మంత్రులను లెక్కచేయని పొగరుబోతు, తాటకి పూతన రాక్షసి, రజియా సుల్తానా అంటూ సంధింటి బంధువు, అచ్చం వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెక్కన చేతులు తిప్పుతూ భూమన కరుణాకర్ రెడ్డి తిడుతున్న తిట్లతో జీవితంలో మళ్లీ మరోసారి కాలరాత్రి వచ్చింది.
అమరావతి అన్నదాతల చీరలతో మొదలెట్టి, వారింటి చెల్లి చీరనూ వదలక, తన చీర వరకూ వెంటాడుతున్న క్రిమినల్స్ గురించి ఏమాలోచించిందో.. మిగిలిన జీవితంలో ఏమి చెయ్యాలని నిర్ణయించుకొందో మరి.
సివిల్స్ టాపర్ అయినా.. అందులో రాజ్యాంగాన్ని ఔపోసన పట్టినా.. తమదైన రాజ్యాంగాన్ని అమలుచేసే సంధింటి క్రిమినల్స్ లాంటి వారి గురించి చదవకపోతే.. చదివిన రాజ్యాంగంను వారికి తాకట్టు పెడితే.. బంగాళా ఉద్యోగ వైభోగ జీవితంలోనే.. ఎలా కాలరాత్రులు అనుభవించాల్సి వస్తుందో.. సివిల్స్ వారికి ఒక కేస్ స్టడీగా మిగిలింది ఐఏఎస్ శ్రీలక్ష్మి జీవితం.