హైదరాబాద్ సిటీ జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్లకు మళ్లీ వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఈసీ, మూసీ నదుల్లో వరద వస్తోంది. హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాల్లో 250 క్యూసెక్కుల చొప్పున వరద వచ్చి చేరుతోంది. దీంతో వాటర్‌బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు.
జలాశయం ఒక గేటును అడుగు మేర, గండిపేట జలాశయం రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గండిపేట రెండు గేట్ల ద్వారా 226 క్యూసెక్కుల నీటిని దిగువన మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ రెండు గేట్ల ద్వారా 339 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీనదిలో వరద ప్రవాహం పెరిగింది.