రాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కామారెడ్డి ,మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు అలుగులు పొంగి పొర్లుతుండడం ,రోడ్లపై భారీ వరద నీరు వచ్చి చేరుతుండడం ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు నీరు నిలువ లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారీ వర్షాలకు వరదల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, లోతట్టు ప్రాంతాల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వారిని అక్కడనుండి తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాల వల్ల గణేష్ మండపాల వద్ద ,ఇతర విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.