బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం పరం సుందరి ఆగస్టు 29న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా, తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీకి మద్దోక్ ఫిల్మ్స్ నిర్మాణం వహించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. సుమారు 136 నిమిషాల నిడివి గల ఈ సినిమాకు కేవలం కొన్ని సంభాషణలలో స్వల్ప మార్పులు మాత్రమే సూచిస్తూ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది.
రిలీజ్ ముందు నుంచే ఈ సినిమా మంచి హైప్ క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో పరం సుందరి ఇప్పటికే సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ను అధిగమించిందని బాక్సాఫీస్ వర్గాలు వెల్లడించాయి. ట్రైలర్ విడుదల తరువాత చెన్నై ఎక్స్‌ప్రెస్తో పోలికలు రావడంతో జాన్వీ, సిద్ధార్థ్ ఇద్దరూ స్పందించారు. ఇది మరింత విభిన్న చిత్రం అని చెప్పారు.
ఇదిలా ఉండగా, జాన్వీ కపూర్ మరో రొమాంటిక్ కామెడీ సన్నీ సస్కారి కి తుల్సి కుమారిలో నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 2, 2025న విడుదల కానుంది. అదేవిధంగా, తెలుగు ప్రేక్షకులకు రామ్ చరణ్ సరసన పెద్ది లో, జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర: పార్ట్ 2లో నటించనుంది.