భారత భూభాగంలోని రావి నదికి వచ్చిన వరదల కారణంగా పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. పాకిస్తాన్ లోని పంజాబ్‌లో వరదలు మరింత తీవ్రం కావడానికి భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడమేనని పాకిస్తాన్ అధికారులు వాపోతున్నారు.
రావి నదిపై నిర్మించిన మాధోపూర్ బారేజీ మధ్యభాగం ఉధృతంగా వచ్చిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందని భారత మీడియా ప్రసారం చేసిన వీడియోను ఉటంకిస్తూ ఒక ప్రముఖ వార్తా సంస్థ కూడా దీన్ని ధృవీకరించింది. నియంత్రణ లేని నీటి ప్రవాహం సరిహద్దు దాటి రావడంతో శుక్రవారం లాహోర్‌లోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని పాకిస్తానీ అధికారులు తెలిపారు.
మాధోపూర్ బారేజీకి చెందిన రెండు గేట్లు తెగిపోవడం నిజమేనని ఒక భారత ప్రభుత్వ వర్గం ధృవీకరించినప్పటికీ, పాకిస్తాన్‌ను ఉద్దేశపూర్వకంగా ముంచివేయాలనే ప్రయత్నం లేదని భారత్ ఖండించింది. బారేజీకి నష్టం జరిగినప్పటికీ, రావి నదిలో నీటి ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాగే రంజిత్ సాగర్ డ్యామ్ ద్వారా నీటి నియంత్రణ కొనసాగుతోందని భారత్ అధికారులు తెలిపారు.
అనవసర వర్షాలే ఈ వరదలకు కారణమని, భారత్ సాధ్యమైనంత వరకు నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని మరొక అధికారి తెలిపారు. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాద దాడుల దృష్ట్యా, 1960 సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయం భారత నాయకత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యగా మిగిలిపోయింది.
దాంతో పాకిస్తాన్ ఇంతకాలం నీళ్లు లేక అలమటించింది. ఇప్పుడు వరదలతో అతలాకుతలం అవుతున్నది.