సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే పవిత్ర కార్యక్రమాలు, విశేష పర్వదినాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు విడుదల చేసిన పర్వదినాలు ఈ విధంగా ఉన్నాయి:
సెప్టెంబర్ 3న విష్ణుపరివర్తనైకాదశి
4న వామన జయంతి
6న అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం
8న మహాలయ పక్ష ప్రారంభం
10న బృహత్యుమా వ్రతం (ఉండ్రాళ్ల తద్దె)
16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
21న మహాలయ అమావాస్య
23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం
28న తిరుమల శ్రీవారి గరుడోత్సవం
29న తిరుమల శ్రీవారి స్వర్ణ రథం