వర్షాలకు దెబ్బతిన్న కాలువలకు చెరువులకు వెంటనే మరమ్మతు చేయించాలని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. 15 రోజులపాటు తీవ్రమైన వర్షాలతో ఆందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రైతులు ఇబ్బందులకు లోనయ్యారు. పంట పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల పత్తి, వరి పొలాలు కొట్టుకుపోయాయి. అట్లాగే కాలువ గట్లు తెగిపోవడం వల్ల కూడా పంట నష్టం జరిగింది.
ఇంత నష్టం జరిగినా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. తెగిన కాలువలు అలాగే ఉన్నాయి. గండిపడ్డ చెరువులు అట్లనే ఉన్నాయి. కానీ వాటిని పూడ్చే ప్రయత్నం ఇప్పటివరకు అధికారులు చేయకపోవడం శోచనీయం అని ఆయన అన్నారు.
నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి మంత్రిగా ఉన్నప్పటికీ ఇటువంటి పరిస్థితి ఉండడం దురదృష్టకరం అని క్రాంతి కిరణ్ అన్నారు. ఉన్నతాధికారులైనా వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి తెగిన సింగూర్ కాలువలను వెంటనే మరమ్మత్తులు చేయించాలని చెరువు గట్లను కూడా రిపేర్ చేయించాలని డిమాండ్ చేశారు.