విశాఖపట్నం హోమ్

గీతం ఎమ్‌సిఎ విద్యార్ధులకు భారీ వేతనంతో ఉద్యోగాలు

#Getam

ప్రముఖ ఐటి సంస్థ మైక్రాన్‌ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ద్వారా ఎమ్‌సిఎ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్ధులను భారీ వేతనంలో ఎంపిక చేసుకుంది.

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలోనే జరిగిన ఈ ప్రాంగణ నియామకంలో ఎమ్‌సిఎ ఆఖరి సంవత్సరం విద్యార్ధులు ఎస్‌.లహరి మోహన్‌, ఎమ్‌.వర్షిణి, పి.భవాని, కె.హర్షవర్ధన్‌రెడ్డి, ఎన్‌.మనోజ్‌ రూ.12.26 లక్షల వార్షిక వేతనంతో మైక్రాన్‌ సంస్థకు ఎంపికయ్యారు.

గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఎమ్‌సిఎ సహ పలు సైన్స్‌ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కెరీర్‌ గైడెన్స్‌ విభాగం అందించిన సహకారంలో విద్యార్ధులు ఈ ఘనత సాధించారు. కాగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్ధులను స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.వేదవతి, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ టి.ఉమాదేవి అభినందించారు.

Related posts

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

Satyam News

తప్పుడు ప్రచారంపై వివరణ కోరిన ప్రభుత్వం

Satyam News

జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు

Satyam News

Leave a Comment

error: Content is protected !!