హైదరాబాద్ హోమ్

విత్తన పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆఫ్రికా ప్రతినిధులు

#SeedTestingCenter

హైదరాబాద్ లో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న ఇండియా – ఆఫ్రికా సీడ్ సమ్మిట్ లో భాగంగా ఆఫ్రికా ప్రతినిధుల బృందం తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం (TISTA) ను సందర్శించడం జరిగింది.

ఆఫ్రికా ప్రతినిధుల బృందంలో ఆఫ్రికా సీడ్ ట్రేడ్ అసోసియేషన్ (AFSTA), సెక్రటరీ జనరల్, యాకబో డయాలో తో పాటు 10 మంది విత్తన రంగ ప్రముఖులు ఈ సందర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డా. కేశవులు, ఇతర అధికారులు TISTA లో ఉన్న అధునాతన విత్తన పరీక్ష పరికరాలు, యంత్రాలు, విత్తన పరీక్ష పద్ధతుల గురించి వారికి వివరించారు.

ఈ సందర్భంగా యాకబో దయాలో మాట్లాడుతూ విత్తన ఎగుమతులకు కావలిసిన అధునాతన సౌకర్యాలను తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ ISTA విత్తన పరీక్ష ల్యాబ్ లో ఏర్పాటు చేసుకోవటం గొప్ప విషయమని, ఆఫ్రికా దేశాలలో కూడా ఇలాంటి విత్తన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇక ఇండో-ఆఫ్రికా సమ్మిట్‌లో తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (టీఎస్‌సీఏ) విత్తన పరీక్ష-ధ్రువీకరణ ఎక్సలెన్సీ అవార్డును గెలుచుకుంది. భారత ఆహార వ్యవసాయ కౌన్సిల్ (ఐసీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా విత్తన రంగంలో విశేష సేవలందించిన సంస్థలకు ఈ అవార్డును అందజేశారు.

అందులో భాగంగా తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ కేశవులు అవార్డు అందుకున్నారు. గ్లోబల్ సీడ్ హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణకు ఇది గర్వకారణమని డైరెక్టర్ డాక్టర్ కేశవులు తెలిపారు.

విత్తన రంగంలోనే తెలంగాణ ఆదర్శం

తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్ విత్తన ధ్రువీకరణ, సీడ్ ట్రేసబిలిటీ విధానాలను ప్రవేశపెట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ కేశవులు. అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ (ఇస్టా) గుర్తింపు పొందిన తెలంగాణ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తన ఎగుమతులకు మార్గం సుగమం చేసిందని వివరించారు.

రైతులు, ఉత్పత్తిదారులకు శిక్షణ ఇస్తూ రాష్ట్ర విత్తన రంగానికి గణనీయమైన సహకారం అందిస్తోందని తెలిపారు. సంవత్సరానికి సుమారు 22 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తూ తెలంగాణతో పాటు మరో పది రాష్ట్రాలకు ధ్రువీకరించిన విత్తనాలను సరఫరా చేస్తోందని స్పష్టం చేశారు.

తెలంగాణలో విత్తనోత్పత్తికి అనుకూల వాతావరణం ఉండటంతో 500కు పైగా విత్తన కంపెనీలు, 3.5 లక్షల మంది రైతులు ఉత్పత్తి చేస్తున్నారని, వారి నుండి దాదాపు 90 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతుండగా 3 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని డైరెక్టర్ కేశవులు తెలిపారు. ‎

Related posts

శాసన మండలిలో కాఫీ రగడ!

Satyam News

పులివెందులలో వార్‌ వన్‌ సైడ్‌… జగన్‌ అభ్యర్ధికి డిపాజిట్‌ గల్లంతు…!!

Satyam News

ముగ్గురు అమ్మాయిలు ఆంధ్రా పేరును నిలబెట్టారు!

Satyam News

Leave a Comment

error: Content is protected !!