రంగారెడ్డి హోమ్

మల్కాజ్ గిరి  స్టేషన్ లో  8 ఎక్స్ ప్రెస్ లు నిలిపేలా చర్యలు

#Malkajgiri

దూరప్రాంతాల నుండి వచ్చే  రైళ్లను మల్కాజ్గిరి స్టేషన్లలో  నిమిషం పాటు నిలిపితే ప్రయాణికులు ఇక్కడ దిగి తమ  గమ్యస్తానం చేరుకొంటారని  జెడ్ ఆర్ యు సి సి మెంబెర్ నూర్  ఇటీవల రైల్వే సమావేశంలో కోరారు. దీనిపై స్పందించి   మల్కాజ్ గిరి  స్టేషన్ లో 8 ఎక్స్ ప్రెస్  లు నిలిపేలా చర్యలు  చేపట్టారు.

శనివారం మొదటి హైదరాబాద్– హిసార్  ఎక్స్  ప్రెస్  కు మల్కాజ్ గిరి  వాసులు ఘన స్వాగతం పలికారు.  వెంటనే స్పందించినందుకు సౌత్ సెంట్రల్  రైల్వే జనరల్  మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ,  పిసిఓయం, కే పద్మజ,  సంతోష్ కుమార్ వర్మ డి ఆర్ యం,  హైదరాబాద్, డాక్టర్ ఆర్ గోపాలకృష్ణ్ న్ సికింద్రాబాద్, డి ఆర్ యంలకు  ట్రావెల్లెర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.

స్టేషన్ మేనేజర్ శ్రీనివాస రావు రైల్వే సిబ్బంది ప్రయాణికుల సంఘం ప్రతినిధులు, ఏ వి స్వామి, పి భరద్వాజ్, హసీనా, వై.శంకర్ రావు, వెంకటేష్ ఆచారి, ఎన్ సత్యమూర్తి, రోషన్  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రధాని నరేంద్ర మోడీకి ముందస్తు జన్మ దినోత్సవ శుభా కాంక్షలు తెలిపారు.

Related posts

తండ్రి సమాధి సాక్షిగా తల్లిని అవమానించిన జగన్

Satyam News

సింగూర్ కాల్వలకు మరమ్మతులు చేయాలి

Satyam News

వైభోగ జీవితంలోని కాళ రాత్రులు!

Satyam News

Leave a Comment

error: Content is protected !!