సోమశిల రిజర్వాయర్ లో 74 టీఎంసీ నీటిని మించకుండా ఉండేవిధంగా రెగ్యులేట్ చేయడానికి నీటిని పెన్నా నదికి 5, 6 గేట్లు ద్వారా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విడుదల చేశారు. ఇంజనీరింగ్ అధికారులతో కులంకుషంగా చర్చించి రాయలసీమ, నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాలకు నీటిని అందించే విధంగా ప్రణాళికలు రూపకల్పన జరుగుతున్నది.
చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాలకంటే 150 టీఎంసీల నీటిని నిలువ చేసుకున్న సామర్థ్యం నెల్లూరు జిల్లాకే ఉంది అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.ఆదివారం సోమశిల జలాశయం నుండి 5, 6 గేట్ల ద్వారా పెన్నా నదికి నీటిని విడుదల చేసి గంగమ్మకు జల హారతిని ఇచ్చిన అనంతరం పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలాశయం సామర్థ్యాన్ని అనుకున్న దానికన్నా 77 టీఎంసీల సామర్థ్యం వరకు పెంచినప్పటికీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా 74 టీఎంసీలు వరకు నీటిని నిలువ చేసుకోవడం జరుగుతున్నదని, కృష్ణానది నుండి శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఏర్పాటు చేయడం వలన రాయలసీమ నెల్లూరుకి నీటి నిల్వకు అవకాశం ఏర్పడిందన్నారు.
ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నంద్యాల జిల్లాలో పర్యటించినప్పుడు కుందునది ప్రవాహం అధికంగా ఉన్నదని అక్కడి నుంచి నీరు పెన్నా నదికి చేరుకోవడం జరుగుతుందని తెలిపారు.
సోమశిల జలాశయం శంకుస్థాపన నుండి ఎన్నో సందర్భాలలో చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. నేటి నుండి 20 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగిందని అందులో కండలేరు జలాశయానికి, తెలుగు గంగ మరియు కనుపూరు కలువాయి కాలువలకు నీటిని విడుదల చేయుటకు తీసుకోవడం జరిగింది అన్నారు.
కండలేరు యొక్క సామర్థ్యం 45 టీఎంసీలు ఉందని రానున్న 15 రోజులలో కండలేరు జలాశయం పూర్తిగా సామర్థ్యం మేరకు నీరు చేరుతుందని తెలిపారు. ఫ్లడ్ ఫ్లో 24000 క్యూసెక్కులు పెంచడానికి టైం పడుతుందని తెలిపారు టెంపుల్ టూరిజం పార్కుల ఏర్పాటు చేయడానికి నాలికలు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
రెవిన్యూ అధికారులు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ సిబ్బంది ఎప్పటికప్పుడు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్ష క్యూసెక్కుల పైన నీరు దాని ప్రభావం ఉంటుందని అన్నారు. ఆనం సంజీవరెడ్డి తెనాలి ద్వారా కరువు పీడిత మండలాలైన మర్రిపాడు వింజమూరు దుత్తలూరుకు నీటిని అందజేసే పనులు ప్రారంభించినట్లు మంత్రి ఆనం తెలిపారు.
హైపవర్ కెనాల్ ద్వారా 60 నుంచి 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నదని అందులో భాగంగా దీపం 2 కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వడం, స్త్రీ శక్తి, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పధకం వంటివి ఉన్నాయన్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుచేసి రైతులకు మంచి జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.