మత మార్పిడుల నివారణకు వీలుగా దళితవాడల్లో 1,000 ఆలయాలు నిర్మిస్తామని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో 6 ఆలయాలు నిర్మిస్తామన్నారు. టీటీడీ ధర్మకర్తల సమావేశం నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ‘ఈ నెల 24 నుంచి వచ్చే నెల 2 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. ఆ రోజుల్లో VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నాం. 24న సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు’ అని వివరించారు.
previous post