కృష్ణ హోమ్

అన్ని జిల్లాల్లో ఘనంగా విశ్వకర్మ జయంతి

#Viswakarma

చేతి వృత్తులను వంశపారపర్యంగా స్వీకరించి, వాటినే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న వారందరికీ 20 సూత్రాలా కార్యక్రమం అమలు చైర్మెన్ లంకా దినకర్ “ విశ్వకర్మ జయంతి “ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి సంకల్పం వికసిత్ భారత్ నెరవేరడానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ  స్ఫూర్తితో తాను లేఖ రాసిన వెంటనే “ విశ్వకర్మ జయంతి “ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ఉత్తర్వులను జారీ చేసిన  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి  ఆయన ధన్యవాదములు తెలిపారు.

బుధవారం రాష్ట్ర సచివాలయం తమ చాంబరులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఏపీఎస్డిపిఎస్ ఈడి అలపర్తి వెంకటేశ్వర రావు , ఎమ్మెస్ఎంఈ ఈడీ సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ రమణారెడ్డి, ప్లానింగ్ డిపార్టుమెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలిపారు. 

పిఎం విశ్వకర్మ యోజన పథకం అమలుపై ఎం.ఎస్.ఎం.ఇ. అధికారులతో సమీక్ష

అనంతరం రాష్ట్రంలో పిఎం విశ్వకర్మ యోజన పథకం అమలుపై ఎం.ఎస్.ఎం.ఇ. అధికారులతో  సమీక్షించడం జరిగిందని ఆయన తెలిపారు.  ఈ పథకం క్రింద రాష్ట్రంలో దాదాపు  31 వేల మందికి  పలు బ్యాంకుల నుండి  రూ.237 కోట్లు రుణాన్ని పొందడం జరిగిందని, మరో 1.20 లక్షల మందికి రుణాలు అందేలా బ్యాంకర్లతో మాట్లాడాలని, నైపుణ్య శిక్షణ పూర్తి అయిన వెంటనే  టూల్ కిట్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

ఈ పథకం క్రింద 18 రకాల చేతి వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి, మొదటి దశలో 5% వడ్డీకి గరిష్టంగా 1 లక్ష రూపాయలు 18 నెలల్లో తిరిగి చెల్లించే విధంగా మరియు రెండవ దఫా 2 లక్షల రూపాయలు 30 నెలల్లో తిరిగి చెల్లించే విధంగా ఈ పథకం అమలు చేయడం జరుగుచున్నదన్నారు.

దేశవ్యాప్తంగా 2028 నాటికి మొత్తం లక్షల లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా 13 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3 దశలలో లబ్ధిదారుల వడపోత అనంతరం 2.23 లక్షల మంది ఎంపిక అవ్వగా, ప్రాథమిక నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న వారు 1.66 లక్షల మంది కాగా, అందులో 1.36 లక్షల మందికి బ్యాంకు రుణాలకోసం దరఖాస్తులు పంపగా, 323 కోట్ల రూపాయిల రుణాలకు సంబంధించిన 39.77 వేల మంది దరఖాస్తులకు బ్యాంకుల రుణ ఆమోదం లభించిందని,  ఇందులో 31 వెయ్య మందికి బ్యాంకులనుండి  237 కోట్లు రుణాన్ని పొందారన్నారు.  

30 వేల మంది చేతివృత్తిదారులకు శిక్షణ

ఈ పథకం క్రింద మన రాష్ట్రంలో 30 వేల మందికి ఇప్పటివరకు రకాల చేతి వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి, 15 వేల రూపాయల విలువైన టూల్ కిట్ ఇవ్వడం జరిగిందన్నారు. పీఎం విశ్వకర్మ యోజన క్రింద రాష్ట్రంలో అత్యధికంగా కడప జిల్లాలో 8,325 రుణాలు, ఆ తరువాత స్థానంలో 6,811 రుణాలతో పశ్చిమ గోదావరి నిలిచిందని ఆయన తెలిపారు.

అనంతరం రాష్ట్ర ప్రణాళిక అధికారులతో  సమావేశమై  ఎస్ డీ జీ సెంటర్ ( సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెంటర్ – దీర్ఘకాలిక  అభివృద్ధి లక్ష్యాల కేంద్రం ) ఏర్పాటు పైన సమీక్షించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎస్డీజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ముందు వివిధ రాష్ట్రాల్లో ఈ కేంద్రాల అమలు తీరును పరిశీలించని సంబందిత అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. 

మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పాలనా విధానాల అవగాహన కోసం రాజస్థాన్ ప్రణాళిక శాఖ అధికారులు  అక్టోబర్ లో రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్బంగా ఆయా తేదీలను ఖరారు చేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను అన్నింటినీ చేయాలని ప్రణాళికా శాఖ అధికారులకు ఆయన సూచించినట్లు తెలిపారు.

Related posts

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News

చీకటి పొత్తులకు బ్రాండ్ అంబాసిడర్ జగన్

Satyam News

ఒకేసారి లక్ష మంది ప్రయాణికులు….

Satyam News

Leave a Comment

error: Content is protected !!