విజయనగరం లో బుధవారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పీఎం మోడీ ఫ్లెక్సీ ని తొలగించారంటూ బీజేపీ ఆందోళన కు దిగింది. నగరంలో న్యూపూర్ణ జంక్షన్ వద్ద ఉన్న వీఎంసీ వద్ద జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ వర్మ భైఠాయించారు. బ్యానర్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి, వెనువెంటనే పీఎం మోడీ ఫ్లెక్సీ ని చెప్పపెట్టకుండా తొలగించారంటూ ధ్వజమెత్తారు.
డిప్యూటీ మేయర్ ఫోటోలు రోజుల తరబడి ఉంచొచ్చు కాని ప్రధాని మోడీ ఫోటో ఒక్క రోజు ఉంచకూడదా అంటూ ప్రశ్నించారు. పీఎం మోడీ కన్న డిప్యూటీ మేయర్ పెద్దా అంటూ బీజేపీ నేతలు గళమెత్తారు. స్పష్ఠమైన హామీ, వివరణ ఇచ్చేంత వరకు ఇక్కడ నుండీ కదలబోమన భీష్మించుకుని కూర్చొని నిరసన తెలుపుచున్నారు. అవసరమైతే పరదాలేసుకుని రాత్రి ఇక్కడే పడుకుని తమ నిరసన కొనసాగిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ హెచ్చరించారు