చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, సిబ్బందిపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్లు, సిబ్బందిపై శుక్రవారం అర్ధ రాత్రి కొందరు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సిబ్బంది వ్యవహారశైలిలో లోపాలేమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చెయ్యాలే తప్ప భౌతిక దాడులకు పాల్పడడం తగదన్నారు. వైద్య సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం సరైన విధానం కాదన్నారు.
previous post