కర్నూలు హోమ్

మానవత్వం చాటుకున్న ఆలూరు ఎమ్మెల్యే

#AluruMLA

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మానవత్వం చాటుకున్నారు. ప్రజలకు సాయం చేయడంలో ఆపద్బాంధవుడు అనిపించుకున్నారు. కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆగస్టు 20వ తేదీన  ప్రమాదవశాత్తు 5వ తరగతి చదువుతున్న 6 మంది విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందడం జరిగింది.

ఆ 6 మంది విద్యార్థుల కుటుంబాలకు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఒక్కో కుటుంబానికి 50,000 వేల రూపాయలు  చొప్పున సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విరుపాక్షి మాట్లాడుతూ ముందుగా 6 మంది విద్యార్థులకు సంతాపం తెలుపుతూ విద్యార్థుల కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అని అన్నారు.

కుటమి ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయడం రావడం లేదని ప్రజలను చాలా చులకనగా చూస్తున్నారని ఆయన అన్నారు. నేను స్వయానా జిల్లా కలెక్టర్ తో మాట్లాడితే జిల్లా కలెక్టర్ నాకు చెప్పింది ఏమంటే మేము అంతా రిపోర్ట్ పైకి పంపించాం అని అన్నారు తప్ప  ఇంతవరకు ఆ కుటుంబాలకు భరోసా కూడా ఇవ్వలేదు.

కూటమి ప్రభుత్వానికి మానవత్వం అనేది లేదు అని ఆయన అన్నారు. కుటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అనుకుంటున్నారు తప్ప, అవి ఏమాత్రం ప్రజలకు  అందలేదని వాళ్లకు తెలియడం లేదు. కూటమి ప్రభుత్వం ఆ 6 కుటుంబాలకు సహాయం చేసేంత వరకు  నేను పోరాడుతూనే ఉంటానని ఆలూరు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

బాధిత కుటుంబాలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ, అధికారులు కానీ మాకు ఇంతవరకు ఏ భరోసా ఇవ్వలేదని అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు.

Related posts

యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్ బిజీ

Satyam News

జగన్‌ ఆట కట్టించిన చంద్రబాబు

Satyam News

ఈ ఘనత నా ఒక్కడిదే కాదు

Satyam News

Leave a Comment

error: Content is protected !!