ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఇప్పుడు ఫుల్‌ఫామ్‌లో పరుగులు పెడుతోంది. 2025-26 మొదటి త్రైమాసికంలో 10.5 శాతం వృద్ధి సాధించింది. ఇది జాతీయ సగటు 8.8% కంటే ఎక్కువ. ఈ గణాంకాలు కచ్చితంగా కూటమి ప్రభుత్వం పనితీరుకు అద్దం పడతాయి.
అంతేకాదు ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలన్న సీఎం చంద్రబాబు అంకిత భావానికి ఈ ఫలితాలు నిదర్శనం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఏపీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే దిశగా నిర్ణయాలు తీసుకుంది. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది.
మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఐటీ వృద్ధి, పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు, శాంతిభద్రతలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారు. దీంతో ఏపీలో లక్షలాది ఉద్యోగావకాశాలు వస్తున్నాయి.
ప్రజల ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడుతున్నాయి. ఏపీని దేశంలోనే మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు చంద్రబాబు. స్కిల్ డెవలప్‌మెంట్, డిజిటల్ గవర్నెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఉండేలా చూస్తున్నారు.
ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసి, సంక్షోభ సమయంలోనూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు సకాలంలో యూరియా అందేలా చూస్తున్నారు. రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు. 10.50 శాతం గ్రోత్ రేట్ కచ్చితంగా కూటమి ప్రభుత్వ మెరుగైన పనితనానికి నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెబుతున్నారు. మంచి నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమేనని ఏపీ నిరూపిస్తుందని చెబుతున్నారు. ఈ సక్సెస్‌తో ఏపీకి మరిన్ని పెట్టుబడులు క్యూ కట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.