హైదరాబాద్ పాతనగరంలోని ఫలక్‌నుమా వంతెన ప్రజలకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 3వ తేదీ, శుక్రవారం నాడు వంతెనను అధికారికంగా ప్రారంభించనున్నారు. సుమారు360 మీటర్ల పొడవు గల ఈ వంతెన నిర్మాణానికి రూ. 52 కోట్లు ఖర్చు చేశారు. రోడ్డు రవాణా సమస్యలను తగ్గించి, స్థానికులకు సులభమైన ప్రయాణ సౌకర్యం కల్పించడం ఈ వంతెన ప్రధాన ఉద్దేశ్యం. ఈ వంతెన పూర్తవడంతో పాతనగరంలోని పలు ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవానికి నగర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఫలక్‌నుమా వంతెన ప్రారంభం స్థానిక ప్రజలకు ఒక పెద్ద శుభవార్త.
previous post
next post