కర్నూలు జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలులో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సేవలు ప్రశంసనీయం అని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో బదిలీ పై వెళుతున్న జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కి ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని జిల్లా అధికారులు నిర్వహించారు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ లేట్ నైట్ వరకు పని చేస్తారని, తాను అర్ధరాత్రి ఏ సమయానికి పరిశ్రమలకి సంబంధించి భూ విషయాల పైన, నివేదికల పైన ఫోన్ చేసినప్పటికీ బాగా స్పందించే వారని తెలిపారు.. సొంత జిల్లాలో సేవ చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుందని, వచ్చిన అవకాశాన్ని కలెక్టర్ చాలా బాగా సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారని మంత్రి తెలిపారు.