పశ్చిమగోదావరి హోమ్

బాణాసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు

#FireWorks

నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ వారి సిబ్బందితో బాణాసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో ఈ రోజు నూజివీడు రూరల్ సర్కిల్ పరిధిలో బాణాసంచా తయారీ మరియు నిల్వ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు వ్యక్తులు అక్రమంగా బాణాసంచా తయారీ, నిల్వ లేదా విక్రయాలు చేపడుతున్నట్లు సమాచారం అందిందని, అందువల్ల ఇలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

బాణాసంచా తయారీకి సంబంధించిన కేంద్రాలు అధికారుల అనుమతు లతో మాత్రమే నడపాలి.

పేలుడు పదార్థాలు నిల్వ చేసేటప్పుడు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలి.

అనుమతులు లేని వారు తయారీ లేదా విక్రయాలు చేపడితే Explosives Act ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అక్రమ బాణాసంచా తయారీ లేదా నిల్వ జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే డయల్ 112 కు లేదా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్‌ కి సమాచారం ఇవ్వవలసిందిగా కోరారు.

బాణసంచా తయారీ కేంద్రాల వద్ద సదర్ కేంద్రాల యజమానులు ఇసుక ను నీటిని అందుబాటులో ఉంచాలని ఎటువంటి ప్రమాదాలు సంభవించిన ఎదుర్కోవడానికి కావలసినటువంటి చర్యలను తీసుకోవాలి.

18 సంవత్సరాల లోపు మైనర్ బాలబాలికలను తయారీ కేంద్రాల వద్ద లేదా విక్రయాల వద్ద వినియోగించరాదని దానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించన యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడతాయని హెచ్చరికలు జారీ చేసినారు.

ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే జరగకుండా తగిన చర్యలు తీసుకొనడం చాలా శ్రేయస్కరమని ప్రజల యొక్క ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం కాని జరగకుండా ప్రభుత్వం వారి అనుమతులు పొందిన వారి మాత్రమే బాణసంచా నిలువలు గాని తయారీ గాని చేయాలని ఇన్స్పెక్టర్  ప్రజలకు సూచించారు

బాణాసంచా తయారీలో అజాగ్రత్త వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. చిన్న పొరపాటు కూడా ప్రాణ నష్టం కలిగించవచ్చు. కాబట్టి ఎవరూ చట్ట విరుద్ధంగా బాణాసంచా తయారీ లేదా నిల్వలు చేయరాదు. పిల్లలు, యువతులు సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని” అన్నారు. నూజివీడు రూరల్ పోలీస్ సిబ్బంది ఈ తనిఖీలను కొనసాగిస్తూ, ప్రజల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు అని తెలియ చేసినారు.

Related posts

తిరుమలపై దండయాత్రకు వస్తున్న జగన్

Satyam News

మధిర లో ఘనంగా దసరా  ఉత్సవాలు

Satyam News

మిథున్ రెడ్డికి బిగ్‌షాక్..బెయిల్ రద్దు.?

Satyam News

Leave a Comment

error: Content is protected !!