ప్రత్యేకం హోమ్

ఏపీలో PPP వైద్య కళాశాలలు: కష్టాలకు పరిష్కారమా?

#AndhraMedicalCollege

గత వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న సమస్యలు విద్యార్థులను, రోగులను తీవ్రంగా దెబ్బతీశాయి. శిథిలావస్థకు చేరిన హాస్టళ్లు, అధ్యాపకుల కొరత, ఆక్సిజన్ అందక రోగుల మరణాలు వంటి సంఘటనలు ప్రభుత్వ వ్యవస్థల అసమర్థతను బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో, ప్రైవేట్-పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ (PPP) నమూనా ఈ సమస్యలకు ఒక సమర్థవంతమైన పరిష్కారంగా ఉంటుందని విశ్లేషణలు చెబుతున్నాయి.

వైకాపా ప్రభుత్వం కొత్తగా ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించినా, వాటికి అవసరమైన నిధులు కేటాయించలేదు. మంజూరైన నిధుల్లో కేవలం 22% మాత్రమే ఖర్చు చేయడంతో భవనాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఐదేళ్లకు 22% లెక్కన కట్టుకొంటూ పోతే… ఇంకో పాతిక సంవత్సరాలు పడుతుందేమో. ఆలోపు పాడవ్వడం, తొలగించి మొదలెట్టడం లెక్కన చేస్తే.. మరెంత నష్టమో!

కొత్త మెడికల్ కళాశాలల్లో 51% ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల విద్యార్థులకు సరైన బోధన అందక విద్యా ప్రమాణాలు పడిపోయాయి. దీర్ఘకాల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గ్రంథాలయాలు, రీడింగ్ హాల్స్, ఆటస్థలాలు లేవు. తిరుపతి, హిందూపూర్, అనంతపురం వంటి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక పలువురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదాలు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం సడలడానికి ప్రధాన కారణమయ్యాయి.

దానితో పాటు వెళ్లడానికే ప్రజలు హడలిపోతున్నారు.  ఇద్దరి కోసం ఉద్దేశించిన గదుల్లో రెండు నుండి నాలుగు మంది విద్యార్థులు. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలోని కొంతమంది పీజీ రెసిడెంట్లు తాగునీరు లేదా పారిశుధ్యం లేని శిథిలావస్థకు చేరిన క్వార్టర్స్‌లో నివసించాల్సి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ (తిరుపతి), GMC అనంతపురంలలో పీజీ హాస్టల్ సౌకర్యాలు లేవు—విద్యార్థులు పారామెడికల్ బ్లాక్‌లలో లేదా బయట అధిక అద్దె గదులలో నివసించారు.

గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) ఇంటర్న్‌లు ప్రైవేట్ గదుల కోసం నెలకు ₹10,000–₹15,000 చెల్లించాల్సి వచ్చింది, ఎందుకంటే కళాశాలలో ఇంటర్న్ హాస్టల్ బెడ్‌లు లేవు. 

కాగ్ (CAG 2024) ఆడిట్ ప్రకారం, 12 జిల్లా ఆసుపత్రులలో ఐదు ఆసుపత్రులలో ఐసీయూలు పనిచేయడం లేదు. సిబ్బంది కొరత కారణంగా పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి; తీవ్రమైన రోగులను దూరం ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చింది. [cag] – పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో మంజూరైన 150 పడకలకు కేవలం 100 మాత్రమే పనిచేస్తున్నాయి; రోజువారీ రద్దీ కారణంగా 500-600 మంది ఔట్-పేషెంట్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది లేదా బయట మందులు కొనాల్సి వచ్చింది.

అప్‌గ్రేడ్ చేయబడిన CHC కొత్తచెరువు 2022లో ఇంకా 6 పడకల PHC వలె నడుస్తోంది; మంజూరైన మూడు సంవత్సరాల తర్వాత కూడా అసంపూర్తిగా ఉన్న భవనాల కారణంగా ఔట్-పేషెంట్లు ఎండలో నిలబడి వేచి ఉండాల్సి వచ్చిందని కాగ్ పేర్కొన్నది. కాగ్ ఆడిట్ నివేదిక ప్రకారం, ₹2.1 కోట్ల విలువైన గడువు ముగిసిన మందులను పంపిణీ చేశారు. ద్వితీయ ఆసుపత్రులలో పూర్తి స్థాయి ల్యాబ్‌లు లేకపోవడం వల్ల పేద రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వచ్చింది.

విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం GGHలలో పే వార్డులు లేవు; గోప్యత కోరుకునే ప్రసూతి కేసులు ప్రైవేట్ క్లినిక్‌లకు మారాల్సి వచ్చింది, అయితే జనరల్ వార్డులలో ఒక్కొక్కటి 20+ మంది రోగులతో నిండిపోయాయి. ఇలా చెప్పుకొంటూ పోతే చాంతాడంత. ఆఖరికి కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ఇచ్చిన పరిహారం కోసం కూడా సుప్రీం కోర్టుకు వెళ్లిన బాధితుల రాష్ట్రం మన దేశంలో ఆంధ్రానే. మాస్కు కోసం బతుకును బలిచ్చుకొన్న సీనియర్ వైద్యుడిని కోల్పోవడం నుండి అన్నో బాధాకర ఘటనలు. వ్యవస్థల విధ్వంసం అలా జరిగింది. చక్కదిద్దలేని పరిస్థితి. దున్నపోతుమీద వర్షం పడ్డట్లుగా పట్టించుకోకుండా వదిలేసే పాలకులైతే పర్లేదు.    

ప్రభుత్వ వైద్య వ్యవస్థలో నెలకొన్న ఈ లోపాలను సరిదిద్దడానికి ICU నమూనా ఒక ఆచరణీయమైన మార్గంగా నిలుస్తుంది. కనీసం ట్రస్ట్‌లు వీటిని మెరుగ్గా నిర్వహించగలవు. వ్యవస్థల విధ్వంసం అలా జరిగింది. ప్రభుత్వ పర్యవేక్షణలో ట్రస్ట్‌లు నిర్వహణలో అధిక పారదర్శకత, సామర్థ్యంతో వ్యవహరిస్తాయి. లాభాపేక్షతో కాకుండా, సేవా దృక్పథంతో పనిచేసే ట్రస్ట్‌లు నిధులను సక్రమంగా వినియోగించి, మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేయగలవు. దీనివల్ల నిధులు దుర్వినియోగం కాకుండా విద్యార్థులకు, రోగులకు మెరుగైన వసతులు అందుతాయి.

వాటి నిర్వహణలో, ఆసుపత్రులలో అధునాతన ఈఛూ పరికరాలు, పూర్తి స్థాయి ల్యాబ్‌లు, నాణ్యమైన ఔషధాల సరఫరా ఉండే అవకాశం ఉంది. ఇది రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించడానికి దోహదపడుతుంది. కాలేజీ టీచింగ్ కోసం చేసే నియామకాలలో ఉండే సుదీర్ఘ ప్రక్రియ, జాప్యాలను ట్రస్ట్‌లు అధిగమించగలవు. అర్హత కలిగిన ప్రొఫెసర్లను, నిపుణులను వేగంగా నియమించడం ద్వారా విద్యా నాణ్యతను మెరుగుపరచవచ్చు. ప్రభుత్వ బడ్జెట్‌పై పూర్తి భారం పడకుండా, PPP నమూనా సేవా / ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇది ప్రజా నిధులను ఇతర కీలక రంగాలకు మళ్లించడానికి వీలు లభిస్తుంది.

PPPలో భాగంగా, ప్రభుత్వం పర్యవేక్షణ సంస్థగా వ్యవహరిస్తుంది. ఇది ప్రైవేట్ ట్రస్ట్‌ల పనితీరును సమీక్షిస్తూ, నిర్ణీత ప్రమాణాలు, లక్ష్యాలు చేరుకునేలా చూడగలదు. తద్వారా విద్యార్థుల, రోగుల కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులలో చూసిన అరాచక పరిస్థితులు, ప్రాణ నష్టాలు, అధ్వాన్నమైన వసతులు ఇకపై పునరావృతం కాకుండా ఉండాలంటే, PPP నమూనా ఒక ఆశాజనకమైన పరిష్కార మార్గం. ప్రైవేట్ ట్రస్ట్‌ల సమర్థవంతమైన నిర్వహణ, పారదర్శకత ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేయగలవని నిపుణులు, సామాన్యులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Related posts

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam News

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య  విస్త‌ర‌ణ ప‌నులు

Satyam News

ఇండియాపై ‘టారిఫ్ వార్’ కు ట్రంప్ ఆదేశాలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!