వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి న్యాయం జరిగి తీరుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నేడు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకా కుటుంబాన్ని మనం గౌరవించాలి. వైఎస్ సునీత సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేసింది. వారికి కచ్చితంగా న్యాయం జరగాలి… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ వివేకా కుటుంబానికి న్యాయం జరగాలని అభిప్రాయ పడ్డారు.. కచ్చితంగా వివేకా హత్య కేసు లో వారి కుటుంబానికి నాయ్యం జరగాలి.. ప్రభుత్వం వైఎస్ వివేకా కుటుంబానికి అండగా ఉంటుంది.. వైఎస్ వివేకా కుటుంబo చాలా అవమానాలు, కష్టాలు పడింది.. వైఎస్ సునీతా కు జగన్ తీవ్ర అన్యాయం చేసాడు.. వివేకా హత్య కేసులో వారికి న్యాయం జరగాలి అని ఆయన అన్నారు. ఒంటిమిట్ట, పులివెందుల ఎన్నికలు ప్రజా స్వామ్య బద్దంగా జరుగుతున్నాయి.. సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనే ద్యేయంగా పనిచేస్తున్నారు… కూటమి ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించు కుంటారు… వైసీపీ కి ప్రజల్లో ఆదరణ తగ్గింది… అందుకే అసత్య ఆరోపణలు… అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
previous post