“శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం శుక్రవారం రాత్రి తిరుమలకి మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు వస్తున్నారు’’ అంటూ వైసీపీ అనుకూల బ్లూ మీడియా ఊదరగొట్టింది. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న వైయస్ జగన్ గారు” అని ఒక పోస్టర్ డిజైన్ చేసి మరీ.. వైకాపా పేజీలో పోస్టు చేశారు.
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ వైసీసీ నాయకుడు, వివాదాస్పద టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఇదంతా ఫేక్ ప్రచారం అని తాజా ప్రచారం చేశారు. పులివెందులలో కూడా డిపాజిట్లు పోయాయి స్వామీ.. ఆ ఒక్కటైనా.. నువ్వే కాపాడు అంటూ హిందూ మత ఆచారాలకు గౌరవం ఇస్తూ.. డిక్లరేషన్ చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడుతాడో.. లేదా యుద్ధానికి వచ్చినట్లు దండెత్తి.. మళ్లీ ఇలా హిందూ మత ఆచారాలను, ఆలయ సాంప్రదాయంను, దేశాన్ని కూడా తప్పుబడుతూ దూషిస్తాడో అని వణికిపోయారు
వైకాపాలో నాయకులు. ఇతర మతాలకు చెందిన సోనియాగాంధీ నుండి అబ్దుల్ కలాం వరకు డిక్లరేషన్ ఇచ్చి మరీ వేంకటేశ్వరుడి దర్శనం చేసుకొన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తన పిల్లాడిని ప్రమాదంలో నుండి కాపాడినందుకు, స్వామికి తలనీలాలు సమర్పించి, డిక్లరేషన్ చేసి దర్శనానికి వెళ్లారు.
ఈ దేశంలోనే పుట్టి, ఇక్కడి సెక్యులర్ రాజ్యాంగం వ్యవస్థలో.. హిందువులు కూడా ఓట్లు వేస్తేనే గెలిచి, అధికారం అనుభవించి, ప్రసాదం కల్తీ చేసి, చిన్నాన్నను కొండ మీద కూచోబెట్టి భ్రష్టుపట్టించి, దర్యాప్తులో నిజమని తెలినా.. రోజూ భూమన కరుణాకర్ రెడ్డితో అబద్దాలు ఆడిస్తూ.. టిటిడిని తిట్టిస్తూ.. వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి జగన్ తాజాగా యుద్ధం మొదలెడుతున్నాడా? అనే అనుమానాలను వైసీపీ పార్టీ వారే వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ నాయుడి సవాల్ తో తోక ముడిచిన జగన్
బుద్ధిగా వచ్చి గుండు కొట్టుకొని, నామం పెట్టుకొని, డిక్లరేషన్ చేసి, దర్శనం చేసుకొని గౌరవంగా వెళ్లాలని ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు ఇటీవలె సవాల్ విసిరారు. కల్తీ కొవ్వుల గురించి భయటపడ్డప్పుడు తిరుపతికి జగన్ దండయాత్రగా వచ్చాడు. డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే దర్శనం అని టిటిడి తేల్చు చెప్పడంతో.. తన మతమైన క్రిస్టియానిటీకి గౌరవం కాపాడుకుంటూ.. వేంకటేశ్వరుని దర్శనానికి నిరాకరించి వెనుతిరిగి వెళ్లిపోయాడు.
అప్పుడు మాట్లాడిన మాటలే ఇప్పుడు శాపాలయ్యాయి. రోజు రోజుకూ పార్టీ మనుగడ కూడా కష్టం అవుతోంది. ఆఖరికి పులివెందులలో కూడా డిపాజిట్ పోయి పార్టీ పుట్టి మునిగింది. బుద్దిగా శ్రీవారికి శరణు అన్నట్లు నటిస్తాడో.. లేదా మళ్లీ వివాదాస్పదం చేసి ఎక్కడ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తాడో అని వైకాపా నేతలు వణికిపోతున్నారు.
వేంకటేశ్వర స్వామిని సవాల్ చేసిన వారి పరిస్థితి మనకు తెలిసిందే అంటూ లోలోపల మదనపడుతున్నారు. జగన్ రెడ్డి తన మిత్రుడైన భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు సలహాలు విని వేంకటేశ్వరుడికి కోపం తెప్పిస్తున్నాడని మరి కొందరు అంటున్నారు.