ముంబై… దేశ ఆర్థిక రాజధాని. అక్కడ క్షణానికో నిర్ణయం, నిమిషానికో కొత్త డీల్, ప్రతి అడుగు కోట్లాది రూపాయల వ్యాపార హడావిడి! అక్టోబర్ 6, 2025 న, ఈ అత్యంత బిజీ పారిశ్రామిక లోకంలో ఉన్న అగ్రగామి పెట్టుబడిదారులు, వేల కోట్ల డీల్స్‌లో నిమగ్నమై ఉన్న కార్పొరేట్ దిగ్గజాలు ఒక్కసారిగా తమ దృష్టిని ఒకే అంశంపై కేంద్రీకరించారు. అదే మన ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యటన మీద!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుపై అచంచలమైన నమ్మకంతో, అపారమైన ఉత్సాహంతో లోకేశ్ ముంబైలో అడుగుపెట్టారు. మన రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకురావాలన్న ఆయన అపార కృషి ఆ బిజీ కార్పొరేట్ ప్రపంచం తమ హడావిడిని పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసింది.
లోకేష్ ఈ ఒక్క రోజులో జరిపిన కీలక భేటీలు మన రాష్ట్ర చరిత్రలో ఓ కొత్త, ఉజ్వల అధ్యాయం రాయబోతున్నాయి.
- టాటా నుండి టెక్నాలజీ వరకు: విశ్వసనీయతకు నిదర్శనం
ప్రపంచ స్థాయి దిగ్గజాలు మన రాష్ట్ర భవిష్యత్తును విశ్వసిస్తున్నారనడానికి నిదర్శనంగా లోకేష్ కీలక ఒప్పందాలకు మార్గం సుగమం చేశారు:
టాటా గ్రూప్‌తో :
టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ని కలిసిన మంత్రి లోకేష్, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ప్రత్యేకంగా కోరారు. ఈ చర్చల్లో ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రా, రూఫ్‌టాప్ సోలార్, సెల్-మాడ్యూల్ తయారీ వంటి అత్యాధునిక రంగాలలో భాగస్వామ్యంపై హామీలు లభించాయి.
భవిష్యత్ ప్రాజెక్టులు: శ్రీసిటీలో ఈవీ భాగాల తయారీ, విశాఖలో టాటా ఎక్సలెన్స్ సెంటర్, ఏరోస్పేస్ యూనిట్లు, మరియు టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా OSAT కేంద్రం స్థాపనకు మార్గం సుగమమైంది. ఇవి మన రాష్ట్రానికి హైటెక్ హబ్ గుర్తింపును తెస్తాయి.
హెచ్‌పీ, బ్లూ స్టార్‌తో :
HP Inc సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌తో జరిపిన చర్చల ఫలితంగా నైపుణ్యాభివృద్ధి కోర్సులు, పీసీ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మన యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.
బ్లూ స్టార్ లిమిటెడ్ చైర్మన్‌తో భేటీలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి R&D కేంద్రాన్ని ఏపీలో స్థాపించే ప్రతిపాదన చేయడం, మన రాష్ట్రం కేవలం తయారీ కేంద్రంగానే కాక, పరిశోధనల కేంద్రంగా మారబోతుందని సూచిస్తుంది.
- పోర్టుల ద్వారా లాజిస్టిక్స్ హబ్‌గా : దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం (1,053.7 కి.మీ.) మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఈ అదృష్టాన్ని లోకేష్ ప్రపంచ లాజిస్టిక్స్ దిగ్గజాలకు చూపించారు. ట్రాఫిగురాతో తీర ప్రాంత అభివృద్ధి: గ్లోబల్ లాజిస్టిక్స్ లీడర్ ట్రాఫిగురా సీఈవో సచిన్ గుప్తాకు, ఏపీలో కోల్డ్ స్టోరేజ్, ఎగుమతి మౌలిక సదుపాయాలలో పెట్టుబడుల కోసం ఆహ్వానం పలికారు. ఇది మన రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ను తెస్తుంది.
ESR గ్రూప్‌తో పారిశ్రామిక పునాదులు: ESR గ్రూప్‌తో విశాఖ, కాకినాడ పోర్టుల వద్ద లాజిస్టిక్స్ హబ్‌లు, ఏపీఐఐసీతో కలిసి పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, రొయ్యల పరిశ్రమకు అత్యవసరమైన కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాకు భాగస్వామ్యం కుదిరింది.
రహేజా గ్రూప్–ప్రిన్స్ టన్ డిజిటల్ గ్రూప్ భాగస్వామ్యాన్ని ఉపయోగించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్‌ను (హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్) ఏర్పాటు చేయండి. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రీమియం అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులను (“రహేజా హోమ్స్”) ప్రారంభించాలని మంత్రి లోకేష్ కోరారు.
ముంబైలో 30వ సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని బిజి బిజీగా భేటీలు చర్చలు జరిపారు.
20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో.. జరిపిన ముంబై పర్యటన కేవలం కొన్ని ఒప్పందాల కోసం కాదు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనే లక్ష్యాన్ని సాధించే దిశగా వేసిన భారీ అడుగు.
మన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం.. ₹30.8 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, డీప్ టెక్నాలజీ, స్పేస్ సిటీ వంటి అంశాలపై దృష్టి సారించడం, ఈ ముంబై పర్యటనకు మరింత బలాన్నిచ్చింది.
ముంబైలో వేసిన ఈ పునాదులు కేవలం పెట్టుబడులు కాదు… ఇవి మన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి, మన యువత భవిష్యత్తుకు వేసిన పునాదులు. నారా లోకేష్ దూకుడు, దూరదృష్టి మరియు ముఖ్యమంత్రి దార్శనికతతో, ఆంధ్రప్రదేశ్ “ఇండియాస్ సన్‌రైజ్ స్టేట్”గా ప్రపంచ పటంలో తళుక్కున మెరవబోతోంది!
మన రాష్ట్రంలో పల్లెల్లో నుండి పట్టణాలలో ప్రజలతో మమేకమైన చోటా భాయ్ లోకేశ్, నేడు ముంబైలో జరిపిన భేటీలు, చర్చలతో మరిన్ని పెట్టుబడులు ఆంధ్రాకు తీసుకురాబోతుంది. బిజీ ముంబై బిజినెస్ మ్యాన్లు మన కోసం అంత సమయం కేటాయించారు మరి.