విజయనగరం జిల్లా పోలీస్ బాస్ ఆదేశాలు శాఖా సిబ్బందిని క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. సాయంత్రం వరకు స్టేషన్ లోనే ఉంటూ వచ్చే బాధితుల బాధలు, ఫిర్యాదులతో ఊపిరి తీయకుండా పని చేస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు రాత్రి డ్యూటీ లు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. బాస్ ఆదేశాలతో రాత్రి పదకొండు నుంచీ 12 వరకు ఒక్కో రోజు ఒక్కో స్టేషన్ ఎస్ఐ డ్యూటీ లు చేస్తుండగా సీఐ మాత్రం రాత్రి నుంచీ తెల్లవారు వరకు డ్యూటీలు చేయడం వారి విధిగా మారింది. ఇక మంగళవారం విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్, రూరల్ సీఐ లక్ష్మణరావు లు రాత్రి పూట గస్తీ తిరిగారు. త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, అనవసరంగా నగరంలో తిరిగి న్యూసెన్స్ చేసిన వారికి పట్టుకొని కేసులు నమోదు చేశారు
previous post
next post