బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్, అధికారుల అలసత్వం ‘ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీ పార్క్’ ఏర్పాటులో కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. అస్తవ్యస్థ నిర్మాణం.. తీవ్ర తప్పిదాలు..ఘోరమైన నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్క్ ప్రజల ఆరోగ్యాలను కాపాడటానికా? లేదా ప్రజల ప్రాణాలు తీయడానికా? అనేది అర్ధం కావడం లేదు.
పార్క్ మధ్యలోనే పెద్ద బండరాయి ఉంది. వయోధికులు, పిల్లలు ఆడుకుంటే ఆ ‘పెద్ద రాయి’ తగిలితే తలకాయ పగిలి చావడం ఖాయంగా కనిపిస్తున్నది. పార్క్ స్థలం ఉన్నదేమో ‘ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీ’లో.. కానీ అధికారులేమో వేరే కాలనీ పేరు పెట్టారు. ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీ వాసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాలనీలు ఏర్పాటు చేసినపుడు ఉన్న పార్క్ లు ఎన్ని? వాటి విస్తీఫ్ణమెంత? ఇపుడు ఎందుకు కుంచించుకుపోయాయి? ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఇంత ఘోరమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
భారత సుదర్శన్, సీనియర్ జర్నలిస్ట్, అధ్యక్షులు, ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీ