జాతీయం హోమ్

ఓపెన్‌ఏఐ భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు

#OpenAI

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామి సంస్థ ఓపెన్‌ఏఐ శుక్రవారం నాడు భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించనుందని వెల్లడించింది. అమెరికా తర్వాత భారత్ చాట్‌జీపిటీకి రెండవ అతిపెద్ద మార్కెట్‌గా, వేగంగా ఎదుగుతున్న దేశంగా గుర్తించబడింది.

ఓపెన్‌ఏఐ అధికారికంగా భారత్‌లో ఒక ప్రత్యేక సంస్థను నమోదు చేసుకుని, స్థానిక బృందాన్ని నియమించుకునే ప్రక్రియను ప్రారంభించింది. భారత్‌లో కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా IndiaAI మిషన్కు మద్దతు తెలుపుతూ, దేశ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేస్తూ “భారత్ కోసం AI, భారత్‌తో కలసి AI” నిర్మించాలనే సంకల్పాన్ని సంస్థ స్పష్టంచేసింది.

భారత్‌లో కోట్లాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, వృత్తిపరులు, డెవలపర్లు చాట్‌జీపిటీ వంటి టూల్స్‌ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ద్వారా వారికి మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని కంపెనీ తెలిపింది. గత ఏడాదిలో భారత్‌లో చాట్‌జీపిటీ వారాంతపు యాక్టివ్ యూజర్లు నాలుగు రెట్లు పెరిగారని గణాంకాలు చూపుతున్నాయి.

డెవలపర్ మార్కెట్‌లో భారత్ టాప్-5 దేశాల్లో ఒకటిగా ఉంది. అంతేకాదు, ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థుల వినియోగదారుల సంఖ్య భారత్‌దే అని ఓపెన్‌ఏఐ వివరించింది. ఓపెన్‌ఏఐ CEO సామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ “భారత్‌లో AI పట్ల ఉన్న ఆసక్తి, అవకాశాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. అద్భుతమైన సాంకేతిక ప్రతిభ, ప్రపంచస్థాయి డెవలపర్ ఎకోసిస్టమ్, బలమైన ప్రభుత్వ మద్దతు ఇవన్నీ భారత్‌ను గ్లోబల్ AI లీడర్‌గా నిలబెట్టగలవు.

భారత్‌లో మొదటి కార్యాలయం ప్రారంభించడం, స్థానిక బృందాన్ని నిర్మించడం ఈ దిశగా తొలి అడుగులు వేస్తున్నం” అని అన్నారు. కొత్త కార్యాలయం ద్వారా స్థానిక భాగస్వాములు, ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, డెవలపర్లు, విద్యా సంస్థలతో బంధాలను బలపరచనున్నట్లు సంస్థ పేర్కొంది. అదేవిధంగా భారత్‌కు అనుగుణంగా ప్రత్యేక ఫీచర్లు, భాషా సదుపాయాలు, మరింత చౌకైన AI టూల్స్‌ను అందించనున్నట్లు స్పష్టం చేసింది.

భారత్ మార్కెట్‌ కోసం ఇప్పటికే చాట్‌జీపిటీ గో, ఓపెన్‌ఏఐ అకాడమీ, భారతీయ భాషలకు మెరుగైన సపోర్ట్ వంటి కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ “డిజిటల్ ఇన్నోవేషన్, AI దత్తతలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోంది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, AI ప్రతిభ, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు భారత్‌ను కొత్త AI విప్లవానికి కేంద్రంగా నిలబెట్టాయి.

ఓపెన్‌ఏఐ నిర్ణయం ఈ దిశగా ఒక పెద్ద మైలురాయి” అని అన్నారు. స్థానిక వ్యాపారాలు, సంస్థలు ఇప్పటికే వ్యవసాయం, నియామక ప్రక్రియలు, పాలనా సదుపాయాల వంటి అనేక రంగాల్లో ఓపెన్‌ఏఐ టూల్స్ వినియోగిస్తున్నాయని వెల్లడించారు. ఈ నెలలో భారత్‌లో మొదటి ఎడ్యుకేషన్ సమ్మిట్, అలాగే ఈ ఏడాది చివరినాటికి మొదటి డెవలపర్ డే కూడా నిర్వహించనున్నట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌లో అనేక ఉద్యోగాలకు నియామక ప్రక్రియ కొనసాగుతోందని, కొత్త కార్యాలయం వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది.

Related posts

ఆగష్టు 16న స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి

Satyam News

భారత్ లో రూ.5.5 లక్షల కోట్ల పెట్టుబడికి జపాన్ సిద్ధం

Satyam News

ప్రభుత్వ సేవలకు రేటింగ్స్

Satyam News

Leave a Comment

error: Content is protected !!