ముఖ్యంశాలు హోమ్

తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్

#PawanKalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్‌తో పాటు తీవ్రమైన దగ్గు కూడా ఉండటంతో అసౌకర్యం కలుగుతోంది.

వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. జ్వరంతో పాటు అలసట, శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనకు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించగా, శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని, రాబోయే కొన్ని రోజులు పూర్తిగా పబ్లిక్ కార్యక్రమాలు, పార్టీ మీటింగ్‌లకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.

పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా ఆయన షెడ్యూల్ చేసిన కొన్ని రాజకీయ, అధికారిక కార్యక్రమాలు వాయిదా వేశారు. జనసేన పార్టీ వర్గాలు ఆయన త్వరలోనే కోలుకొని సాధారణ కార్యక్రమాలు పునరుద్ధరిస్తారని తెలిపాయి. మరోవైపు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన త్వరితగతిన కోలుకోవాలని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉన్నప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన సమయానికి పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలుకావడం గమనార్హం.

Related posts

జగన్‌ ఆట కట్టించిన చంద్రబాబు

Satyam News

ది ట్రాన్స్‌పోర్టర్ సునీల్ రెడ్డి ఎవరు?

Satyam News

గూగుల్ కు విశాఖే ఎందుకు నచ్చింది?

Satyam News

Leave a Comment

error: Content is protected !!