రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (డి డి ఓ) డివిజనల్ డవలప్మెంట్ అధికారులుగా ప్రభుత్వం పదోన్నతి కలిపిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఈ ఆదేశాలు అధికారికంగా విడుదల కావాల్సి ఉందని సమాచారం.
అదేవిధంగా రాష్ట్రం లో ఎమ్ పి డి ఓ ల నుండి డి డి ఓ లు గా పదోన్నతి పొందిన వారి స్థానాలతో కలుపుకుని ఖాళీగా ఉన్న 160 మండలాలకు మండల పరిషత్ అభివృద్ది అధికారులను ప్రభుత్వం త్వరలో నియమించనుందని తెలిసింది.
ఇలా కొత్తగా నియమించే 160 మంది ఎమ్ పి డి ఓ పోస్టులలో ఎక్కువ శాతం ఆయా మండలాలలో విధులు నిర్వహించే సీనియర్ ఈ ఓ పి ఆర్ డి లకు ఎమ్ పి డి ఓ లు గా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం.
ఎమ్ పి డి ఓ లు నుండి డి డి ఓ లు గా పదోన్నతి పొందే వారిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్ పి డి ఓ పై ఏకంగా 43 ఆడిట్ అభ్యంతరాలు ఉన్నాయని ఆడిట్ అధికారులు తమ విచారణ లో తేల్చారని తెలిసింది.
అయితే ఆ ఎమ్ పి డి ఓ తన ఆర్థిక పలుకు బడిని ఉపయోగించుకుని ఆయన విధులు నిర్వహించే కాలం లో జరిగిన ఆడిట్ లో తన పై వచ్చిన 43 ఆడిట్ అభ్యంతరాలను డి డి ఓ పదోన్నతుల సందర్భంగా నాట్ ప్రూవ్డ్ గా నిరూపించుకున్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఎమ్ పి డి ఓ వ్యవహారం పై జిల్లా పరిషత్ స్టేజి ఉద్యోగులలో కొంతమంది లో అంతర్గతంగా హాట్ హాట్ గా రగులుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఎవరా ఎమ్ పి డి ఓ ఆయన పై ఉన్న 43 ఆడిట్ రిపోర్ట్ లను తారు మారు చేసి ఆ ఎమ్ పి డి ఓ కి క్లిన్ చిట్ ఇచ్చిన అధికారులెవరు? ఈ 43 ఆడిట్ రిపోర్ట్ లను మాఫీ చేయడం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారాయని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో మరో మహిళా ఎమ్ పి ఫై ఓ గతం లో ఓ పంచాయతీ కి నకిలీ స్పెషల్ ఆఫీసర్ గా వెళ్లి ఆ పంచాయతీ కార్యదర్శితో చేతులు కలిపి ఆ పంచాయతీ లో ఉన్న 8 లక్షల రూపాయల నిధుల ను నకిలీ వెలి ముద్ర వేసి స్వాహా చేసిన ఘటన పై కూడా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు 43 ఆడిట్ రిపోర్ట్ లున్న ఎమ్ పి డి ఓ పైన ఒక పంచాయతీ నుండి నకిలీ స్పెషల్ ఆఫీసర్ గా నకిలీ వేలు ముద్ర వేసి 8 లక్షలు దోపిడీకి పాల్పడ్డ ఎమ్ పి డి ఓ పై కూడా తిరిగి విచారణ చేపట్టాలని జిల్లాకు చెందిన కొంతమంది జిల్లా పరిషత్ ఉద్యోగులు కోరుతున్నారు.