కొల్లేరు వైఎస్ఆర్సిపి నాయకుడు మోరు రామరాజు ఇంటిని వడ్డిగూడెం గ్రామస్తులు ముట్టడించారు. పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఏలూరు శనివార పేట స్థానిక కట్టా సుబ్బారావు తోట లోని వైఎస్ఆర్సిపి కొల్లేరు నాయకులు మోరు రామరాజు ఇంటిని ముట్టడించడం సంచలనం కలిగించింది.
రామరాజుకు చెందిన రామరాజు హైట్స్ అపార్ట్మెంట్ సెల్లార్ లోకి ప్రవేశించిన మహిళలు ధర్నా చేశారు. రామరాజు వడ్డి గూడానికి చెందిన 560 మంది వద్ద నుంచి రెండు విడతలుగా రూ..10, 200 లు చొప్పున 57 లక్షల 12 వేల రూపాయలు ఇళ్ల స్థలాన్ని నిమిత్తం గ్రామస్తుల వద్ద ఆయన తీసుకున్నారని వాటిని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆయన చుట్టూ తిరిగి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని అడిగితే మమ్మల్ని చంపేస్తాను అంటున్నట్లు ఆరోపిస్తున్న కుల పెద్దలు ముంగర విష్ణు, జయ మంగళ హరిబాబు, ఘంటసాల మారుతి, మోరు సతీష్, ఘంటసాల బసవ శాస్త్రి ,ఘంటసాల సుబ్బరాజు, మోరు వెంకన్న, మంగళ దుర్గ బాబు, భలే వీర్రాజు లు అన్నారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను నిలువరిస్తూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.