అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎలా ఉంటుందో తెసుకుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది. ఆ ఆసక్తికి తగిన విధంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏ విధంగా ఉంటుందో చెప్పే డిజైన్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు విడుదల చేశారు.
క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 అంశాలపై నేడు అమరావతిలో జరిగిన రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో పాలనలో టెక్నాలజీ వినియోగంపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అదే విధంగా కలెక్టర్ల సదస్సులో క్వాంటం వ్యాలీ భవనాల డిజైన్ల ప్రదర్శన నిర్వహించారు.
కార్యాలయ స్థలం డేటా లేక్ లో అన్ని శాఖలకు చెందిన 6 పెటా బైట్ల డేటా ఉంది. 80 వేల మంది పనిచేసేలా క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణం ఉంటుంది. భవిష్యత్తులో 3 వేల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం అందుబాటులో ఉంటుంది.