తూర్పుగోదావరి హోమ్

మద్యం మత్తులో కారు పైకి బైక్‌తో దూసుకెళ్లిన యువకుడు

#RoadAccident

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయ రహదారిపై  ఒక యువకుడు రాంగ్‌ రూట్‌లో బైక్‌ నడుపుతూ, మద్యం మత్తులో అతివేగంగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లాడు. ​యువకుడు నడుపుతున్న బైక్ నేరుగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో, కారు ముందు భాగం (బానెట్, బంపర్) తీవ్రంగా ధ్వంసమైంది.

ప్రమాద తీవ్రతకు బైక్ పూర్తిగా నుజ్జునుజ్జు అయి రోడ్డుపై పడిపోగా, బైక్ నడుపుతున్న యువకుడు కారు బానెట్‌పై, విండ్‌షీల్డ్ పగిలిన చోట కూర్చుండిపోయాడు. ​ప్రమాదం జరిగిన సమయంలో యువకుడు మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు తెలిపారు. రోడ్డుపై వాహనాలు రాకపోకలు నిలిచిపోగా, స్థానికులు ప్రయాణికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే యువకుడి ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts

కామ్రేడ్ సురవరం ఇక లేరు

Satyam News

ట్రైలర్ రిలీజ్: మద్యం కుంభకోణంపై సంచలన చలన చిత్రం

Satyam News

విశాఖకు మరో ఘనత..మహిళలకు అత్యంత సురక్షిత నగరం

Satyam News

Leave a Comment

error: Content is protected !!