తణుకు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెరవలి వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న సలాది సత్యనారాయణను ఢీకొట్టి, ఆపై పక్కనే ఉన్న ఇంటిలోకి బస్సు దూసుకెళ్లింది.
ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని తీపర్రు జనసేన నాయకుడు తన కారు ద్వారా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై పెరవలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.