కళ్ళు, తల తిరుగుడు ఆరోగ్య సమస్యకు అత్యాధునిక వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు కడప నగరంలోని జయాదిత్య న్యూరో కేర్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ వల్లంపల్లి గణేష్ తెలిపారు. శుక్రవారం జయాదిత్య న్యూరో కేర్ లో తల తిరుగుడు కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య తల తిరుగడం అన్నారు. సహజంగా కొందరికి తల తిరిగి, వాంతి వచ్చినట్లుగా ఉందని అంటుంటారు. దీన్నే వైద్య పరిభాషలో వెర్టిగో అంటారు.
వెర్టిగో అనేది తప్పుడు చలన భావన, తల తిరుగుతున్న భావన లేదా అసమతుల్యత భావన. బాధితులు దీనిని తరచుగా మైకం కమ్మడం, అసమతుల్యత, తలతిరగడం లేదా హిందీలో ‘చక్కర్ ఆనా’ అంటారు. ఇలాంటి వారు తమ తలను కదిలించినప్పుడు ఇది మరింత తీవ్రమవుతుంది. వెర్టిగో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ సమస్యతో బాధపడే వారు ఒంటరిగా ఎక్కడికి వెళ్లలేక భయపడుతుంటారు.
చూడటానికి ఇది చిన్న సమస్యగా అనిపిస్తుంది. కాని అనుభవించే వారి బాధ అంతా ఇంతా కాదు.వెర్టిగో’ కు గల కారణాలు తెలుసుకుంటే చికిత్స చాలా సులువు అవుతుంది.
వెర్టిగో కారణాలు – లక్షణాలు
తల తిరుగుడు కు అనేక కారణాలు ఉన్నాయి. అందులో మానసిక ఒత్తిడి, తలకు గాయం, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, పోషకాహార లోపం ఉన్నాయి.ఇవే కాకుండా చెవి లోపల ఇన్ఫెక్షన్, ఎక్కువ సేపు ఎండలో ఉండటం, పార్శ్వపు నొప్పి, రక్త ప్రసరణలో మార్పులు కారణం కావచ్చు. పెర్టిగో లో నిరపాయకరమైన పరోక్సిస్మల్ పొజిషనల్ వెర్టిగో (బిపిపివి), వెస్టిబ్యులర్ న్యూరిటీస్ లేదా లాబ్రింథైటిస్, మెనియర్స్ వ్యాధి, మైగ్రేన్-సంబంధిత పెర్టిగో లు ఉన్నాయి. లక్షణాలను పరిశీలిస్తే స్పిన్నింగ్ సెన్సేషన్, వికారం లేదా వాంతులు, సమతుల్యత సమస్యలు, చెమటలు పట్టడం, సాధారణ కంటి కదలికలు (నిస్టాగ్మస్) లాంటివి గమనించవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా 5 శాతం మంది తల తిరుగుడు తో అవస్థలు పడుతున్నారు. మన దేశంలో 6 కోట్ల మంది క్రానిక్ వెర్టిగో తో సతమతమవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
” జయాదిత్య న్యూరోకేర్”లో తమ మార్గదర్శకత్వంలో భారతదేశపు అతిపెద్ద వెర్టిగో, డిజ్జినెస్ క్లినిక్ నెట్వర్క్ అయిన ” న్యూరో ఈక్విలిబ్రియం” తో కలిసి పనిచేస్తున్నాం. తద్వారా రోగులకు మా కొత్త సేవ ” వెర్టిగో ప్రొఫైల్” ను అందిస్తున్నాం. కేవలం మెట్రో నగరాలకే పరితమైన చికిత్సలు కడప లో అందుబాటులో ఉన్నాయి.
న్యూరో ఈక్విలిబ్రియం’
భారతదేశంలో 250 కి పైగా ‘ ప్రదేశాలలో వ్యాపించింది. దీని ద్వారా 1లక్ష మంది చికిత్స పొందిన రోగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది దీర్ఘకాలిక వెర్టిగోతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు డాక్టర్ వల్లంపల్లి గణేష్ వివరించారు. వివరాల కొరకు 7995325152/9642948148 అనే సెల్ నెంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.