పట్టుదలతో కసి తో క్రీడలలో పాల్గొన్నప్పుడు ఉత్తమ్ ఫలితాలను వస్తాయని క్రీడ శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారుడు తాము ఒలంపిక్ లో పథకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని పట్టుదల కసితో సాధన చేయాలని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖామంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. బుధవారం ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాజీవ్ గాంధీ ఖేల్ ఉత్సవ్ 3k రన్ లో మూడు కిలోమీటర్ల పరుగు చేసిన అనంతరం ఆయన ముగింపు సభలో సరూర్ నగర్ స్టేడియంలో క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు.
ప్రతి క్రీడాకారునికి జీవితంలో ఒక సారి అవకాశం దొరికినప్పుడు తమ ప్రతిభను తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవాలని సూచించారు. తన జీవితంలో కూడా ఒక్క ఓవర్ అవకాశం దొరుకుతే ఆ ఓవర్ నా తన జీవితాన్ని మార్చి ఒక రంజీ క్రీడాకారులుగా తీర్చిదిద్దని తెలిపారు. తెలంగాణలో క్రీడను అభ్యసిస్తున్న ప్రతి క్రీడాకారుడిగా తీర్చి ఒలంపిక్ వరకు తీసుకు వెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని నూతనంగా తెలంగాణ క్రీడా పాలసీ ఏర్పాటు చేసిన అవసరమైతేనే కమిన్ మెంట్ చేరడానికి సిద్దంగా క్రీడాకారులు ఎలా ఎదగాలో సూచనలు ఇస్తే పాలసీలో పొందుపరుస్తామని తెలిపారు
తెలంగాణ రాష్ట్రంలో కోచ్ కొరత ఉందని త్వరలో దాన్ని పూర్తి చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలలాగా సంవత్సరాలులు సమస్యలను త్వరలో వారంలో తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు యువతరాన్ని చెడు అలవాట్లు వైపు ఉండకుండా మైదానాలలో క్రీడలు అభ్యసించే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని క్రీడామైదానానికి తమ పిల్లలను తెస్తే క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు
మాజీ పార్లమెంటరీ సభ్యుడు టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్న కోచ్ లను గ్రేట్ త్రీ ఉద్యోగులుగా గుర్తించి మరి కొంతమంది కోచ్ లను నియమించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ ఫెరేషన్ ప్రధాన కార్యదర్శిగా శ్రీ పాల్ రెడ్డి, కార్యదర్శిగా డాక్టర్ బి. లక్ష్మయ్య కోపాది కారి జే. రాజశేఖరం రెడ్డి , డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి లింగాల కిషోర్ గౌడ్ వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.