వికారాబాద్ జిల్లా పరిగిలోని ఖాన్ కాలనీ మార్కెట్ యార్డులో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. 9 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వారి పాదాలను, పిక్కలను పట్టి పీకాయి. కుక్కల దాడిలో గాయపడిన వారు సీరియస్ గా ఉన్నారు. పరిగి ఆసుపత్రిలో కుక్క కాటుకు మందు లేకపోవడంతో తాండూరు ఆసుపత్రికి బాధితులు వెళ్లారు. కుక్కలను నివారించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఆసుపత్రిలో కనీసం మందులు ఉండడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
previous post
next post