మదనాపూర్ సమీపంలోని సరళాసాగర్ జలాశయం వరద ప్రవాహాలతో ఉధృతంగా ఉప్పొంగుతోంది. జలాశయం వద్ద ఒక వుడ్ సైఫన్, ఒక ప్రైమరీ సైఫన్ ఆటోమేటిక్‌గా తెరుచుకోవడంతో భారీగా నీరు విడుదల అవుతోంది. దీంతో కాజ్‌వే బ్రిడ్జ్ పైకి వరద నీరు ప్రవహిస్తూ ప్రమాద స్థితి ఏర్పడింది. వరద ఉధృతి కారణంగా కొత్తకోట–ఆత్మకూర్, వనపర్తి మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక అధికారులు ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ఈ మార్గంలో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. వరద నీటి ఉధృతి తగ్గే వరకు పరిస్థితి సాధారణం కావడం కష్టమని అధికారులు తెలిపారు.