విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే (NH-65)పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగలు, వీకెండ్ సెలవులు, భారీ వర్షాలు వల్ల నగరవాసులు టూర్లకు వెళ్లడంతో తిరిగి నగరానికి వచ్చే వాహనాలతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది. అదనంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ట్రాఫిక్ జామ్‌కి కారణం. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు వాహనాలు గంటల తరబడి నిలిచిపోగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
previous post
next post