ప్రపంచం హోమ్

హనుమాన్ విగ్రహంపై దారుణ వ్యాఖ్యలతో వివాదం

#Hanuman

టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఇటీవల ఆవిష్కరించిన 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. టెక్సాస్ స్టేట్ సెనేట్‌కు జీఓపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న డంకన్, ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో విగ్రహ వీడియోను పంచుతూ, “హిందువుల తప్పుడు దేవుడి తప్పుడు విగ్రహాన్ని టెక్సాస్‌లో ఎందుకు అనుమతిస్తున్నాం? మనది క్రైస్తవ దేశం” అని పేర్కొన్నారు.

అనంతరం బైబిల్‌లోని ఎగ్జోడస్ గ్రంథంలోని వచనాలను ఉటంకిస్తూ, “నన్ను తప్ప మరే దేవుడు నీకు ఉండకూడదు. విగ్రహారాధన చేయకూడదు” అని రాశారు. ఈ వ్యాఖ్యలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) సహా పలు మతాంతర, పౌరహక్కుల సంస్థలు తీవ్రంగా ఖండించాయి.

HAF దీనిని “హిందువుల పట్ల వ్యతిరేకత, రెచ్చగొట్టే వ్యాఖ్య”గా పేర్కొంటూ టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేసింది. అలాగే, అభ్యర్థిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో డంకన్ వ్యాఖ్యలపై విస్తృత చర్చ చెలరేగింది. కొందరు అమెరికా రాజ్యాంగం హామీ ఇస్తున్న మత స్వేచ్ఛను గుర్తు చేశారు. ఒక వినియోగదారు జోర్డాన్ క్రౌడర్ స్పందిస్తూ, “నీవు హిందువుకావడం వల్లే అది తప్పుడు అవ్వదు.

వేదాలు యేసు పూర్వమే రాయబడ్డాయి. హిందూ మతాన్ని గౌరవించి అధ్యయనం చేయడం మంచిది” అని పేర్కొన్నారు. 2024లో ఆవిష్కరించిన ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ 90 అడుగుల ఎత్తులో ఉండి అమెరికాలోని మూడవ అతిపెద్ద విగ్రహంగా నిలిచింది. ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామిజీ ఆలోచనల ఆధారంగా నిర్మించబడిన ఈ విగ్రహం ఐక్యత, శాంతి కి ప్రతీకగా నిలుస్తోంది.

Related posts

కేసీఆర్ పూజ గదిలో ఏముందో తెలిస్తే……

Satyam News

మరచిపోలేని మంచి చిత్రం “నేనెవరు?”

Satyam News

తప్పుడు ప్రచారంపై వివరణ కోరిన ప్రభుత్వం

Satyam News

Leave a Comment

error: Content is protected !!