ముఖ్యంశాలు హోమ్

ఆటో డ్రైవర్ల పట్ల చంద్రబాబుకు ఈ అకస్మాత్తు ప్రేమ ఎందుకు?

#SuperSix

ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు ముహుర్తం ఖరారు చేసింది. దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనంతపురంలో జరిగిన సూపర్‌ సిక్స్ – సూపర్‌ హిట్‌ కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన చేశారు చంద్రబాబు.

ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేయాలని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో చంద్రబాబు ఆటో డ్రైవర్లకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ హామీని దసరా నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. గత వైసీపీ ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో రూ.10 వేలు ఇచ్చేది. ఐతే తిరిగి వాటిని ఏదోరకంగా వసూలు చేసింది. రకరకాల ట్యాక్సులతో ఆటో డ్రైవర్లను దోచుకుంది. ఐతే ఇప్పుడు చంద్రబాబు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

దాంతో ఈ పథకంపై ఆటో డ్రైవర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 2 తేదీన దసరా పండగ ఉంది. ఆ రోజున ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే ఆటో డ్రైవర్ల ఆనందానికి హద్దులు ఉండవు. నిజానికి ఏపీ సర్కార్ తీసుకువచ్చిన ఉచితబస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లపై పెద్దగా ప్రభావం ఉండదు.

ఐనప్పటికీ కూటమి సర్కార్ పెద్ద మనసుతో ఆటో డ్రైవర్లకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద రూ.15 వేల చొప్పున సాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించగా.. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థికసాయం అందనుంది. మొత్తంగా వారు రూ.435 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు.

అర్హులు వీళ్లే

సొంత వాహనం కలిగి, దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది. 2023-24లో ఈ పథకం కింద 2.75 లక్షల మంది అర్హులున్నారు. ఇందులో ఆటో డ్రైవర్లు 2.5 లక్షల మంది, ట్యాక్సీ, మ్యాక్సీక్యాబ్‌ల డ్రైవర్లు 25 వేల మంది. తాజాగా వీరి సంఖ్య మరో 15 వేల వరకు పెరిగి ఉంటుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

దీంతో ఈసారి 2.90 లక్షల మందికి సాయం అందుతుందని భావిస్తున్నారు. సీఎం ప్రకటన నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం సచివాలయంలో ఆ శాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, అదనపు కమిషనర్‌ రమాశ్రీ, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఎన్ని ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీక్యాబ్‌లు ఉన్నాయి, వాటి యజమానుల్లో ఎంత మంది డ్రైవింగ్‌ చేస్తూ ఉపాధి పొందుతున్నారు..? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Related posts

కొడంగల్ లో వీధి కుక్కల స్వైర విహారం

Satyam News

నేపాల్ నుంచి భారత్ కు ప్రత్యేక విమానాలు

Satyam News

ట్రంప్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ

Satyam News

Leave a Comment

error: Content is protected !!