ప్రత్యేకం హోమ్

ది ట్రాన్స్‌పోర్టర్ సునీల్ రెడ్డి ఎవరు?

#YSSunilReddy

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నర్రెడ్డి సునీల్ రెడ్డి, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా, ఆయన వ్యాపార, రాజకీయ వ్యవహారాలను చూసే కీలక వ్యక్తిగా పేరుగాంచారు. తాజాగా ఏపీ మద్యం కేసులో సిట్ ఆయనకు చెందిన పలు కంపెనీల్లో సోదాలు నిర్వహించడంతో మరోసారి ఆయన పేరు వార్తల్లో నిలిచింది.

ఈ నేపథ్యంలో సునీల్ రెడ్డి నేపథ్యం, జగన్‌తో ఆయనకున్న లోతైన అనుబంధం, వ్యాపార సామ్రాజ్యం, మరియు గతంలో ఆయనపై నమోదైన కేసులను పరిశీలించడం సముచితం. నర్రెడ్డి సునీల్ రెడ్డి స్వస్థలం కడప జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం, అనిమెల గ్రామం.

చిన్న ఉద్యోగిగా చేరి….

ఆయన కుటుంబం మూడు దశాబ్దాల క్రితమే పులివెందులకు వలస వెళ్లి, వై.ఎస్. రాజశేఖరరెడ్డి నివాసానికి సమీపంలోనే నివసించేది. సునీల్ రెడ్డి తండ్రి నర్రెడ్డి సంగిరెడ్డి స్వతహాగా జియాలజిస్ట్. మైనింగులకు చాలా అవసరం కదా.. ఈ పరిచయం, వైఎస్ కుటుంబానికి ఉన్న లోతైన అనుబంధం కారణంగా సునీల్ రెడ్డిని ఒక చిన్న ఉద్యోగిగా వై.ఎస్. జగన్ కంపెనీలో చేర్చారు.

ఆ తరువాత అల్లుకు పోయాడు. ఎంతలా అంటే బేబీకి చెప్పి, చెప్పి, గురువు విజయసాయి రెడ్డిని అవమానించేలా.. బయటకు పంపేలా. బహుశా అదే ఇవ్వాళ అందరూ అడ్డంగా దొరకిపోవడానికి కారణం కావచ్చు! జగన్ సన్నిహిత సర్కిల్‌లో అతి వేగంగా ఎదిగిన సునీల్ రెడ్డికి, జగన్ సతీమణి వై.ఎస్. భారతి రెడ్డితో ఉన్న బంధుత్వం ఒక కీలక పాత్ర పోషించింది.

ఈ కుటుంబ సంబంధం కారణంగానే ఆయన జగన్ వ్యాపార సామ్రాజ్యంలో ఒక ముఖ్య స్థానాన్ని పొందగలిగారు. కొన్ని వ్యాపార లావాదేవీలలో జగన్ సోదరి షర్మిలతో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయని చెబుతారు. జగన్‌తో ఉన్న ఈ సన్నిహిత సంబంధాల కారణంగా, ఆయనకు ‘ది ట్రాన్స్‌పోర్టర్’ అనే మారుపేరు వచ్చింది.

ముఖ్యమైన వ్యాపార పత్రాలు, నగదును తరలించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. సునీల్ రెడ్డి జగన్ కోసం అనేక కంపెనీలను స్థాపించారు. ఆయనతో పాటు ఆయన తండ్రి నర్రెడ్డి సంగిరెడ్డి కూడా పలు జగన్ గ్రూప్ కంపెనీలలో డైరెక్టర్లుగా పనిచేశారు.

సీబీఐ దర్యాప్తులో భాగంగా, 2005లో సునీల్ రెడ్డి స్థాపించిన సునీల్ ప్రాజెక్ట్స్ & ఫౌండేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోకి 11 నకిలీ కంపెనీల నుండి ₹45.21 కోట్లు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. ఈ కంపెనీలకు చిరునామాలు లేవు, లావాదేవీలు జరిగిన వెంటనే మూసివేయబడ్డాయి. కార్పొరేట్ రికార్డుల ప్రకారం, సునీల్ రెడ్డి  ప్రస్తుతం డజనుకు పైగా కంపెనీలలో డైరెక్టర్‌గా ఉన్నారు.

వీటిలో గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్, అర్నా ఫార్మా, జలమంతన్ డ్రెడ్జింగ్ అండ్ సబ్-సీ సర్వీసెస్, మరియు ఆర్.ఆర్. గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు సముద్రయానం, పెట్రోకెమికల్స్, ఫార్మా, మరియు ఇంజినీరింగ్ వంటి వివిధ రంగాలలో విస్తరించి ఉన్నాయి.

ఆయన పాత్ర ఆర్థిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాలేదు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సలహాదారుగా మరియు రాజకీయ వ్యూహకర్తగా కూడా ఆయన పనిచేశారు. సునీల్ రెడ్డి జగన్‌కు వ్యక్తిగత సహాయకునిగా కూడా వ్యవహరించారు. పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, వారి సమస్యలను జగన్‌కు చేరవేయడం వంటి కీలకమైన సమన్వయ బాధ్యతలను నిర్వహించేవారు.

జగన్ ఓదార్పు యాత్రలో కీలక పాత్ర

జగన్ రాజకీయ జీవితం ప్రారంభంలో, ముఖ్యంగా ఓదార్పు యాత్ర సమయంలో, సునీల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాలను పర్యవేక్షించారు. పార్టీ తరపున ప్రకటనలు, ప్రెస్ నోట్స్ విడుదల చేయడం, మీడియా అపాయింట్‌మెంట్‌లను నిర్వహించడం వంటి పనులను చూసుకున్నారు.

వై.ఎస్.ఆర్. మరణానంతరం జగన్ చేపట్టిన “ఓదార్పు యాత్ర”ను రూపొందించడంలో, నిర్వహించడంలో సునీల్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో సునీల్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమైనది.

ఈ కేసులో 2012లో ఆయన సీబీఐ చేత అరెస్ట్ చేయబడ్డారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ విల్లాల అమ్మకాల ద్వారా వచ్చిన ₹96 కోట్ల అక్రమ డబ్బును మళ్లించడంలో సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది. సునీల్ రెడ్డి తన సౌతెండ్ ప్రాజెక్ట్స్ కంపెనీలోకి 10 నకిలీ కంపెనీల ద్వారా ₹51 కోట్ల అక్రమ డబ్బును తరలించినట్లు సీబీఐ గుర్తించింది.

మారిషస్ వంటి దేశాల ద్వారా ₹125 కోట్ల విదేశీ డబ్బును జగన్ కంపెనీలలో పెట్టుబడిగా పెట్టడంలో కూడా సునీల్ రెడ్డికి సంబంధం ఉందని సీబీఐ అనుమానించింది. సునీల్ రెడ్డి ఈ కేసులో బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే సీబీఐ కేసు నుండి తనను డిశ్చార్జ్ చేయాలని కోర్టును ఆశ్రయించారు.

తనపై కేసు నిరూపించడానికి ఏజెన్సీ వద్ద సరైన సాక్ష్యాలు లేవని ఆయన వాదించారు. సునీల్ రెడ్డిని ఒకప్పుడు “ట్రాన్స్‌పోర్టర్” గా, జగన్ “రెండు చేతుల్లో ఒక చెయ్యి”గా అభివర్ణించేవారు. దేశంలోనే అతి పెద్దదైన లిక్కర్ స్కాములో, ఈ తాజా సోదాలు దర్యాప్తులో ఎలాంటి కీలక ఆధారాలు వెలికితీస్తాయో వేచి చూడాలి. జగన్ చేతి వరకు సోదాలు వచ్చింది అంటే.. ప్యాలస్ ఎంత బెదురు వుంటుందో అర్థం చేసుకోవచ్చు.

Related posts

అక్షరం నుంచి ఆకాశమంత – గురు దీవెన

Satyam News

స్పోర్ట్స్ పట్టుదలతో ఆడాలి

Satyam News

బంగారం స్మగ్లింగ్: నటి రన్యారావుకు రూ.102 కోట్ల భారీ జరిమానా

Satyam News

Leave a Comment

error: Content is protected !!