వనపర్తి జిల్లా కేంద్రంలో ఎ సిబి కార్యాలయం ఏర్పాటు చేయాలని నిజాయితీపరులు కోరుతున్నారు. వివిధ శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులు సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉన్నా కాని చేయరు. కారణాలు తెలుపడం, ఆలస్యం చేయడం, ఇబ్బందులు పెట్టడం అలవాటు.
ఇంకా కొందరు ఉద్యోగులు రేకమెండ్ ద్వారా వనపర్తి జిల్లాకు రావడం, కోరిన పోస్టింగ్ తీసుకుని డ్యూటీలో చేరి మురిసి పోవడం, తెగ ఫీల్ కావడం అలవాటు. రాజకీయ పార్టీలకు అధికారం (ప్రభుత్వం) శాశ్వతం కాదు, ఉద్యోగులకు పోస్టింగ్ శాశ్వతం కాదు. ఇతర జిల్లాలకు వనపర్తి జిల్లాకు తేడా ఉంది.
అధికారులు వనపర్తి చరిత్ర, ప్రజల నాడి తెలుసుకుని పని చేయాలి. ఏదో రకంగా రేకమెండ్ ద్వారా వచ్చాం, ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. విర్ర వీగిన ఇబ్బందుల్లో ఇరకడం ఖాయం. వనపర్తిలో నాయకులు ప్రజల వెంట ఉంటారు. సమస్య వస్తే ప్రజల వైపు నేతలు ఉంటారు. పోలీస్, జ్యూడిషయల్, అధికారంలో ఉన్న వారితో వనపర్తి వారికి చట్టాలు తెలిసిన వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. నమ్మకం ఉంటుంది. వనపర్తిలో ఎవరూ ఎవరికి భయపడరు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్