కృష్ణ హోమ్

గత పాలకుల తప్పిదాలతో….టిడ్కో నివాసితులకు కష్టాలు….

గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్తంగా తయారైన గుడివాడ టిడ్కో కాలనీను ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చి దిద్దుతానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

గుడివాడ పట్టణం టిడ్కో కాలనీలో 40 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 10 హెచ్.పి. సామర్థ్యం కలిగిన పవర్ బోర్ వెల్స్ ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా బోర్లు ద్వారా వచ్చిన నీటిని తాగిన ఎమ్మెల్యే రాము… సంతృప్తి వ్యక్తం చేస్తూ…. నీటి నాణ్యతా పరీక్షలకు పంపాలంటూ అధికారులకు సూచించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టిడ్కో కాలనీ నివాసితులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అన్ని విధాలుగా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. గత పాలకులు చేసిన తప్పులను సరిచేస్తున్నామన్నారు. కనీస వసతులు కూడా లేకుండా లబ్ధిదారులకు ఫ్లాట్లను అప్పగించడంతో వాళ్లు నానా అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేసిన తప్పులకు కాలనీ మురికి కుపంలా మారే పరిస్థితి ఏర్పడిందన్నారు.

స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ అద్భుతమైన కాలనీగా గుడివాడ టిడ్కోను అభివృద్ధి చేస్తామన్నారు. కాలనీలో నెలకొన్న అద్వాన్న పరిస్థితులను సరి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

ప్రాధాన్యత ప్రకారం శానిటేషన్, డ్రైనేజీ, త్రాగునీరు ఇలా ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. పారిశుద్ధ్య మెరుగుకు పదిమంది సానిటేషన్ సిబ్బందిని నియమించామని భవిష్యత్తులో వారి సంఖ్యను పెంచుతామన్నారు.అస్తవ్యస్తంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతులకు ఆధునిక యంత్రాలతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రస్తుతం 40 లక్షల నిధులతో ఐదు బోర్ వెల్స్ వేసామని, మరిన్ని నిర్మించేందుకు మరో 30 లక్షలు నిధులు మంజూరు అయ్యాయన్నారు. ప్రజలకు రెండు పూటల నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. కాలనీను సుందర మయంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిలో స్థానిక ప్రజలు కూడా భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, నిరంజన్,లలిత, మున్సిపల్ ఎం ఈ ప్రసాద్, డిఇ శివాజీ, స్థానిక ప్రజలు,
మహి కీర్తి ఇన్ ఫ్రా సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam News

ఆరోపణలు ఉన్నా ఆగదు ప్రమోషన్

Satyam News

ఆర్థిక నేరం కేసులో రమేష్ అరెస్ట్

Satyam News

Leave a Comment

error: Content is protected !!